Patancheru: యువతలో నైపుణ్యం పెరగాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది.

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో క్రీడా సందడి నెలకొంది. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ టు ఆల్’ కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను శనివారం ఉదయం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
క్రీడలతో ఆత్మవిశ్వాసం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేలా ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల ద్వారా కేవలం శారీరక ధారుడ్యమే కాకుండా మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
హాజరైన ముఖ్యులు
ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీఐ రమణారెడ్డితో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.



