తెలంగాణసంగారెడ్డి

RC Puram: యువతకు స్ఫూర్తిప్రదాత వివేకానంద.. రామచంద్రాపురంలో ఘనంగా జయంతి వేడుకలు

భారతీయ యువతకు దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

రామచంద్రాపురం: భారతీయ యువతకు దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని, ఆయన చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా సోమవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నివాళులర్పించిన ప్రముఖులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేష్ హాజరయ్యారు. వారు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన బోధనలను, సమాజానికి అందించిన సందేశాలను నేతలు స్మరించుకున్నారు.

దేశ నిర్మాణంలో యువశక్తి పాత్ర
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. వివేకానంద యువతకు ఇచ్చిన “లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అనే నినాదం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. నేటి యువత వ్యసనాలకు దూరంగా ఉండి, సేవా భావంతో సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. దేశాన్ని అగ్రగామిగా నిలపాలంటే యువత తన శక్తిని సరైన మార్గంలో వినియోగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని స్వామి వివేకానందకు నీరాజనాలు అర్పించారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *