తెలంగాణసంగారెడ్డి
NMR: ఆలయ నిర్మాణానికి రూ. 2 లక్షల విరాళం అందజేసిన నీలం మధు ముదిరాజ్
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతుగా అండగా నిలిచే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు

మెదక్: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దేవాలయాల నిర్మాణాలకు తనవంతుగా అండగా నిలిచే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్డారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి ఆయన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
నీలం మధు ఆదేశాల మేరకు ఎన్ ఎం అర్ (NMR) యువసేన సభ్యులు లక్డారం గ్రామాన్ని సందర్శించి, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. భక్తిభావంతో ఆలయ నిర్మాణానికి మద్దతుగా నిలిచిన నీలం మధుకు ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



