13 C
London
Saturday, April 19, 2025
Homeసంగారెడ్డిబహుజనుల వీరుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్!

బహుజనుల వీరుడు కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్!

Date:

  • ఆయన ఆశయాలను కొనసాగించి ఐక్యంగా ముందుకెళదాం
  • పిలుపునిచ్చిన నీలం మధు ముదిరాజ్​

స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త , బహుముఖ ప్రజ్ఞాశీలి కొర్వి కృష్ణ కృషితోనే ముదిరాజ్ సంఘం ఏర్పడిందని మెదక్​ పార్లమెంట్​ కాంగ్రెస్​ పార్టీ కంటెస్టెడ్​ క్యాండిడేట్​ నీలం మధు ముదిరాజ్​ అన్నారు. హైదరాబాద్ నగర మేయర్ గా పని చేసి ఆయన ముందుచూపుతో చేసిన నగర మాస్టర్ ప్లాన్ చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ముదిరాజ్ మహాసభ సంఘం ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగానూ పనిచేశారన్నారు. కొర్వి కృష్ణస్వామి వర్ధంతి పురస్కరించుకొని చిట్కుల్​ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్​ మాట్లాడుతూ.. బహుజనుల ముద్దుబిడ్డ, మహానేత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ బహుజనుల పక్షాన ఉండి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ముదిరాజ్ జాతి ఐక్యత కోసం ముదిరాజ్ మహాసభ సంఘాని స్థాపించి వారి అభివృద్ధి కోసం ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు. ఆ మహానేత ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో ముందడుగు వేసి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలన్నారు.

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

Latest stories