13 C
London
Saturday, April 19, 2025
Homeరాష్ట్రంఫార్ములా – ఈ కార్​ రేస్​ కేసులో ఏ1గా కేటీఆర్​

ఫార్ములా – ఈ కార్​ రేస్​ కేసులో ఏ1గా కేటీఆర్​

Date:

ఏ2గా ఐఏఎస్​ అర్వింద్​కుమార్​, ఏ3గా బీఎల్​ఎన్​ రెడ్డి

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా – ఈ కార్​ రేసింగ్​ వ్యవహారంలో ఆయనను ఏ1గా చేర్చారు. ఏ2గా ఐఏఎస్​ అర్వింద్​ కుమార్​, ఏ3గా హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ బీఎల్​ఎన్​ రెడ్డి పేర్లను చేర్చారు. నిధుల దుర్వినియోగ అంశమై చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్​ శాంతికుమారి మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్​ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్​ నుంచి అనుమతి లభించడంతో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగానే తాజాగా ఈ కేసులో ఏ1గా కేటీఆర్​ పేరును చేర్చింది.

చర్చపెడితే సమాధానమిస్తా – కేటీఆర్​
తనపై కేసు నమోదు చేసిన విషయమై కేటీఆర్​ గురువారం అసెంబ్లీలోనూ మాట్లాడారు. సభలో చర్చ పెడితే తాను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్​ విసిరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సభలో ఈ కార్​ రేస్​ అంశమై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్​ చేశారు.

Related stories

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం

ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా ప్రయోజనం శూన్యం సంగారెడ్డిలో నిరసన చేపట్టిన...

ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల...

గుర్తుపట్టలేనంతగా మారిన పోలీస్​ ఆఫీసర్​

ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్​ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా...

కొండపోచమ్మ జలాశయంలో… అయిదుగురు యువకులు గల్లంతు

సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు...

అల్ప్రాజోలం అమ్మి.. రూ.60కోట్లు సంపాదించారు

ఉత్పత్తి చేసేందుకు లండన్​ లో పీజీ చదువుతున్న విద్యార్థి సాయం సంగారెడ్డి జిల్లా...

Latest stories