అత్యల్పంగా 6.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో నమోదయింది. టీఎస్డీపీఎస్ వెబ్సైట్లో జనవరి 3 ఉదయం 8.30గంటల నుంచి జనవరి 4 ఉదయం 8.30గంటల వరకు రికార్డు అయిన వివరాల ప్రకారం కోహిర్లో 6.0డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పరిశీలిస్తే 30 ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇందులోనూ 22 ప్రాంతాలు సంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి.
తొమ్మిది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయిన ప్రాంతాలిలా!
- కోహిర్ – 6.0
- న్యాల్కల్ – 6.3
- అల్మాయిపేట – 7.3
- మల్ చెల్మ – 7.5
- నల్లవల్లి – 7.7
- అల్గోల్ – 7.9
- సత్వార్ – 8.1
- బీహెచ్ఈఎల్ – 8.2
- లక్ష్మీసాగర్ – 8.2
- మొగుడంపల్లి – 8.3
- బోడగట్ – 8.4
- నిజాంపేట – 8.5
- ఝరాసంగం – 8.7