సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీజీఐఐసీ ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించడంతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ ఛైర్మన్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అమలు చేయనున్నామన్నారు. సంగారెడ్డి ప్రజల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి, సదాశివపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్లు రామచంద్ర నాయక్, గడీల రాంరెడ్డి, సీనియర్ నాయకులు కూన సంతోష్, కిరణ్, రైతు సంఘం నాయకుడు తుమ్మలపల్లి ప్రిథ్వీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.