ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలీస్ ఆఫీసరు ఎవరో తెలుసా? ఆయనతో బాగా పరిచయం ఉన్న వాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ పోలీస్ అధికారి పేరు తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పదినెలలుగా జైల్లో ఉన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పదినెలలుగా జైల్లో ఉన్న తిరుపతన్న గుర్తు పట్టలేనంతంగా మారిపోయారు. గతంలో ఆయన సంగారెడ్డి డీఎస్పీగా పనిచేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది స్టేట్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలకంగా ఉన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు.