అకౌంట్లలోకి రూ.6,000.. కొందరికి రూ.12,000! ఏపీ రైతులకు కీలక అప్డేట్
పీఎం కిసాన్ 22వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. అర్హతల ప్రకారం కొందరు రైతుల అకౌంట్లలో డబుల్ మొత్తాలు జమ కావచ్చు.

- పీఎం కిసాన్ 22వ విడత నిధులపై స్పష్టత
- అన్నదాత సుఖీభవతో కలిసి ఒకేసారి డబ్బు జమ
- కొత్త రూల్స్‌తో కొందరికి రూ.12,000 అవకాశం
అమరావతి / న్యూఢిల్లీ: రబీ సీజన్లో సాగు పనులు ఊపందుకున్న వేళ ఏపీ రైతులకు ఊరటనిచ్చే వార్త వినిపిస్తోంది. పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ సహాయం కూడా ఒకేసారి అకౌంట్లలో జమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈసారి నిధుల విడుదలపై దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తుండగా, బడ్జెట్ ప్రక్రియ పూర్తయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరి రెండో వారంలో ఈ నిధులు విడుదలయ్యే అవకాశముంది.
ఎంత డబ్బు వస్తుంది?:
పీఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు రూ.2,000 జమ అవుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మరో రూ.4,000 వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా మందికి మొత్తం రూ.6,000 అందనుంది.
డబుల్ మనీ ఎలా?:
ఇటీవలి నిబంధనల ప్రకారం ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు వేరువేరుగా నివసిస్తున్నట్లు ధ్రువీకరణ ఉంటే, రెండు కుటుంబాలూ విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే రెండింటికీ పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు వస్తాయి. దీంతో కొందరు రైతులకు మొత్తం రూ.12,000 వరకు జమయ్యే అవకాశం ఉంది.
మిస్సైన వారికి మరో ఛాన్స్:
గత విడతలో (21వ విడత) పీఎం కిసాన్ లేదా అన్నదాత సుఖీభవ నిధులు రాని రైతులు, అర్హత ఉంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అలా చేస్తే పెండింగ్ మొత్తంతో పాటు తాజా విడత డబ్బు కూడా ఒకేసారి రావచ్చు. ఈ విధంగా కొందరికి రూ.13,000 వరకు జమయ్యే అవకాశముంది.
రైతులు ఏం చేయాలి?:
ఆధార్, బ్యాంక్ అకౌంట్, భూమి వివరాలు సరిగా ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవాలి. కుటుంబ విభజన జరిగిన రైతులు కొత్తగా దరఖాస్తు చేస్తే, అధికారులు దాదాపు 10 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తిచేసే అవకాశం ఉంది.
ముందు పరిస్థితి ఎలా?:
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, వారం రోజుల్లో నిధుల విడుదల తేదీపై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి. అలా జరిగితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం సహాయం రైతుల అకౌంట్లలో చేరినట్టవుతుంది.



