బిజినెస్

భారతీయ మూలాలు, కుటుంబ విలువల కలయికగా సీడీకే ‘కన్వర్జెన్స్ 2026’ వేడుకలు

ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది

హైదరాబాద్, మార్చి 18, 2026: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘సీడీకే’ (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో ‘కన్వర్జెన్స్ 2026’ వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువులకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది “మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం” (Going Back to Our Indian Roots) అనే థీమ్‌తో, భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించారు.

ఉత్తమ పనితీరుకు గుర్తింపు.. కుటుంబమే పునాది
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.

సాంస్కృతిక ప్రదర్శనలు విశేషాలు
కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. అక్కడ పిల్లలు కుండల తయారీ (Pottery), వివిధ ఆటలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు ‘రివార్డ్స్ అండ్ రికగ్నిషన్’ విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు.

మేనేజ్‌మెంట్ సందేశం
సంస్థ ఎదుగుదలలో కుటుంబ సభ్యుల పాత్ర గురించి సీడీకే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. “కుటుంబ సభ్యుల మద్దతు, ప్రోత్సాహం వల్లే మా ఉద్యోగులు అద్భుతాలు సాధించగలుగుతున్నారు. తెలివైన కుటుంబాలు తెలివైన వ్యక్తులను పెంచుతాయి, ఆ వ్యక్తులు గొప్ప బృందాలను నిర్మిస్తారు, ఆ బృందాలే ఒక కంపెనీని గొప్ప సంస్థగా మారుస్తాయి. ఇదే మా విజయ రహస్యం” అని పేర్కొన్నారు.

సీనియర్ డైరెక్టర్, హెచ్ఆర్ హెడ్ ఆశిష్ సక్సేనా మాట్లాడుతూ.. “మేమంతా ఒకే కుటుంబంలా కలిసి ఉన్నప్పుడే మా శక్తి పెరుగుతుంది. ఈ కన్వర్జెన్స్ వేడుక కేవలం సంస్కృతి గురించి మాత్రమే కాదు.. మన మధ్య ఉన్న గౌరవం, కృతజ్ఞత ఐక్యతను చాటిచెబుతుంది. ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా మేము సాగిస్తున్న ప్రయాణానికి ఇది ఒక నిదర్శనం” అని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *