గోద్రెజ్ ఇంటీరియో వినూత్న పరుపుల శ్రేణి, భారీ విస్తరణ ప్రణాళికలు
ప్రముఖ ఫర్నిచర్, డిజైన్ బ్రాండ్ గోద్రెజ్ ఇంటీరియో భారతదేశంలో పెరుగుతున్న నిద్ర ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని తన మ్యాట్రెస్ విభాగంలోని ఉత్పత్తులను భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రముఖ ఫర్నిచర్, డిజైన్ బ్రాండ్ గోద్రెజ్ ఇంటీరియో భారతదేశంలో పెరుగుతున్న నిద్ర ఆరోగ్య స్పృహను దృష్టిలో ఉంచుకుని తన మ్యాట్రెస్ విభాగంలోని ఉత్పత్తులను భారీగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ముంబై వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో 2029 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విభాగంలో 150 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించాలని సంస్థ స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనిని సాధించే క్రమంలో దేశవ్యాప్తంగా 25 కొత్త పంపిణీదారులను నియమించుకోవడంతో పాటు 300 మందికి పైగా కొత్త రిటైలర్ల ద్వారా మెట్రో నగరాలు టైర్ 2 టైర్ 3 పట్టణాల్లో తన ఉనికిని బలోపేతం చేయనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 1000కి పైగా రిటైల్ స్టోర్లు ఐదు అత్యాధునిక తయారీ కేంద్రాలు ఉన్నాయి.
భారతదేశ పరుపుల మార్కెట్ ప్రస్తుతం 2.40 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండగా 2031 నాటికి ఇది 3.89 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ విభాగం 25.80 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. వినియోగదారులు ప్రస్తుతం వెన్నునొప్పి నివారణ వెన్నెముక ఆరోగ్యంపై అధిక ఆసక్తి చూపుతున్న తరుణంలో గోద్రెజ్ సంస్థ ఆర్థోమాటిక్ సిరీస్ లో భాగంగా ప్రీమియం మాక్స్ వంటి ప్రత్యేక రకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి వెన్నెముకకు సరైన మద్దతును అందిస్తూ దీర్ఘకాలం మన్నేలా రూపొందించబడ్డాయి. స్లీప్సీ వంటి బడ్జెట్ ధరలోని పరుపులతో పాటు ప్రీమియం విభాగంలో సెవెన్ జోన్ పాకెట్ స్ప్రింగ్ సిస్టమ్ గల స్లీప్ గ్రాండే వంటి ఉత్పత్తులు శరీర భాగాలకు అనుగుణంగా సౌకర్యాన్ని అందిస్తాయి.
ఆధునిక జీవనశైలిలో నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదని అది ఆరోగ్యానికి అత్యంత కీలకమని వినియోగదారులు గుర్తిస్తున్నారు. అందుకే గోద్రెజ్ ఇంటీరియో తన ఓమ్నీ ఛానల్ ఉనికిని పెంచుకుంటూ వినియోగదారులకు ఆన్ లైన్ ఆఫ్ లైన్ మార్గాల్లో సులభంగా అందుబాటులో ఉండాలని భావిస్తోంది. నాణ్యమైన డిజైన్ మన్నికైన ఉత్పత్తులతో నిద్ర పరిష్కారాలను అందించడం ద్వారా మార్కెట్లో తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.



