భారత్‌లో చాట్ జీపీటీ బ్రాండెడ్ కన్వర్సేషనల్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన జియోహాట్‌స్టార్
ఓపెన్ ఏఐ ఏపిఐలను ఉపయోగించి రూపొందించిన ఈ వాయిస్, టెక్స్ట్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారులు సహజమైన భాషా సంభాషణల రూపంలో భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ లైబ్రరీని అనేక భాషల్లో అన్వేషించవచ్చు.

హైదరాబాద్: దశాబ్ద కాలానికి పైగా డిజిటల్ వినోదం అనేది ఒకే మార్గంలో సాగుతోంది. మీరు వెతకడం, క్లిక్ చేయడం, చూడటం మాత్రమే ఇప్పటివరకు జరుగుతోంది. కానీ ఇవాళ జియోహాట్‌స్టార్ మరియు ఓపెన్ ఏఐ ఒక చారిత్రక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దీని ద్వారా భారత దేశ అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాట్ జీపీటీ ఆధారిత వాయిస్ సెర్చ్ మరియు లీనమయ్యే సరికొత్త అనుభవాన్ని ప్రవేశపెట్టి, వినోదాన్ని మానవ భాషా సంభాషణగా మార్చబోతున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా, మల్టీలింగ్వల్ కాగ్నిటివ్ సెర్చ్ సహాయంతో ‘ఏం చూడాలి’ అనే సందిగ్ధానికి జియోహాట్‌స్టార్ పరిష్కారం చూపుతోంది. దీనివల్ల కంటెంట్ కోసం వెతికే అలసట తగ్గి, అర్థవంతమైన, మానవ సహజమైన అన్వేషణ సాధ్యమవుతుంది.
భారత దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ఈ ఆవిష్కరణ ద్వారా, ప్రేక్షకులు తమకు నచ్చిన కథలను వివిధ భాషలు, జానర్లు మరియు సందర్భాలకు అనుగుణంగా కేవలం మాట్లాడటం ద్వారానే కనుగొనవచ్చు. ఇది స్ట్రీమింగ్ అనుభవాన్ని ఒక సహజమైన, వ్యక్తిగత సంభాషణగా మారుస్తుంది.
మెనూలను వెతకడం లేదా కీవర్డ్‌లను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, ప్రేక్షకులు తమ ఉద్దేశాన్ని, మానసిక స్థితిని లేదా సందర్భాన్ని కేవలం మాటల ద్వారా చెబితే చాలు. దానికి అనుగుణంగా అత్యంత తెలివైన మరియు సందర్భోచితమైన సూచనలను తక్షణమే పొందవచ్చు. ఈ చాట్ జీపీటీ బ్రాండెడ్ వాయిస్ అసిస్టెంట్ పాత పద్ధతిలోని పరిమిత కీవర్డ్ సెర్చ్ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. ప్రేక్షకులు అడిగినవి మాత్రమే కాకుండా, వారు వెతుకుతున్నట్లు వారికే తెలియని అద్భుతమైన అంశాలను కూడా ఇది సూచిస్తుంది. తద్వారా వినోదాన్ని అనుభవించడానికి ఇది ఒక గొప్ప మరియు అర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది.
సాంకేతికతకు ప్రాధాన్యం..
ఈ భాగస్వామ్యం గురించి జియోస్టార్ వైస్ ఛైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ ఇలా అన్నారు.. “మీడియా మరియు వినోద పరిశ్రమలో ఏఐ (AI) ఒక విప్లవాత్మక మార్పును సూచిస్తుంది. ఇది ఆలోచన, నిర్మాణం నుండి అన్వేషణ మరియు ఆదాయం వరకు ప్రతి అంశాన్ని ప్రాథమికంగా మారుస్తుంది. సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చే, వినియోగదారుడికి మొదటి స్థానమిచ్చే వేదికగా జియోస్టార్ తన యూజర్ ఎక్స్‌పీరియన్స్ లో ఏఐని అంతర్భాగం చేస్తోంది. ఓపెన్ ఏఐతో మా భాగస్వామ్యం ద్వారా ప్రేక్షకులు కేవలం తమ వాయిస్ ఉపయోగించి కంటెంట్‌ను కనుగొనవచ్చు, దానితో మమేకమవ్వచ్చు. తమకు నచ్చిన విధంగా రూపొందించుకోవచ్చు. ఇది వినోద అనుభవాన్ని సరికొత్తగా ఊహించేలా చేస్తుంది. సంస్కృతిని ముందే అంచనా వేస్తుంది. ప్రతి వీక్షకుడికి అత్యంత వ్యక్తిగతమైన అనుభూతిని కలిగిస్తుంది.” అని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి ఓపెన్ ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో(Fidji Simo) మాట్లాడుతూ.. “సాధారణంగా వినోదం అనేది ఒకే మార్గంలో సాగే ప్రక్రియ, అక్కడ మీరు కేవలం కంటెంట్‌ను చూస్తారు. కానీ ఏఐ ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తుంది. జియోహాట్‌స్టార్‌తో మా భాగస్వామ్యం ద్వారా పర్సనలైజ్డ్ ఏఐని నేరుగా వినోదం మరియు లైవ్ స్పోర్ట్స్ రంగాల్లోకి తీసుకువస్తున్నాము. దీనివల్ల ప్రతి క్షణం లోతైన అనుభూతిని పొందే అవకాశంగా మారుతుంది. వీక్షకులు చూడటం నుండి అడగడం వరకు, కుతూహలం నుండి సందర్భం వరకు మరియు అన్వేషణ నుండి సూచనల వరకు చాలా సహజంగా, వ్యక్తిగతంగా మరియు తక్షణమే ఉపయోగపడే రీతిలో మారవచ్చు.” అని పేర్కొన్నారు.
ఏది అడిగినా..
“మా తల్లిదండ్రులు వస్తున్నారు. మేమందరం కలిసి చూడదగ్గ కంటెంట్ ఏదైనా సూచించు” అని వినియోగదారులు అడిగినా, లేదా “మేము కవలలం, మాకు కేవలం కవలల గురించిన సినిమాలే కావాలి” అని అడిగినా, ఈ తెలివైన అసిస్టెంట్ ఆయా సాంస్కృతిక అంశాలను, సందర్భాలను మరియు లోతైన అభ్యర్థనలను అర్థం చేసుకుని సరైన సూచనలను అందిస్తుంది. అంతేకాకుండా, జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా స్కోర్లు, కీలక ఘట్టాలు, క్రీడాకారుల హైలైట్స్ లేదా తమకు కావాల్సిన ఏ సమాచారాన్నైనా కేవలం మాటల ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.
లైవ్, ఆన్-డిమాండ్ (on-demand) రెండింటిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ప్రారంభంలో కొన్ని ఎంపిక చేసిన ఫీచర్లతో మొదలుపెట్టి, దశలవారీగా విస్తరించనున్నారు.
కేవలం యాప్‌లోనే కాకుండా, జియోహాట్‌స్టార్ మరియు ఓపెన్ ఏఐ సంయుక్తంగా చాట్ జీపీటీలో కూడా కొత్త అనుభవాలను పరిచయం చేయనున్నాయి. దీనివల్ల వినోద అన్వేషణ కేవలం జియోహాట్‌స్టార్ యాప్‌కే పరిమితం కాకుండా బయట కూడా విస్తరిస్తుంది. ఎవరైనా వినియోగదారులు వినోదానికి సంబంధించిన ప్రశ్నలను చాట్ జీపీటీని అడిగినప్పుడు, జియోహాట్‌స్టార్‌లోని భారీ కంటెంట్ లైబ్రరీ నుండి వారికి తగిన సూచనలు మరియు సంబంధిత స్ట్రీమింగ్ లింక్‌లు అందుతాయి. ఈ భాగస్వామ్యం రెండు ప్లాట్‌ఫామ్‌ల మధ్య లోతైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది.
నూతన అధ్యయనం..
జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ రంగంలో ఏఐ (AI)ని భారీ స్థాయిలో అనుసంధానించడం ద్వారా డిజిటల్ వినోదంలో సరికొత్త అధ్యాయనం ప్రారంభమవుతోంది. ఓపెన్ ఏఐ అధునాతన ఏఐ మోడల్స్ ఆధారంగా రూపొందిన ఈ కొత్త కన్వర్సేషనల్ డిస్కవరీ ఫీచర్, స్ట్రీమింగ్‌ను అత్యంత తెలివైనదిగా, సందర్భోచితమైనదిగా, వ్యక్తిగత అనుభవంగా మారుస్తుంది. ఇది ఈ పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.
భారతదేశంలో స్ట్రీమింగ్ రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, వినియోగదారుడి ఉద్దేశాన్ని మరియు సందర్భాన్ని అప్పటికప్పుడు అర్థం చేసుకునే మేధో సామర్థ్యమే ఇతర ప్లాట్‌ఫామ్‌ల కంటే దీన్ని భిన్నంగా నిలబెడుతుంది. ఏఐ ఆధారిత పర్సనలైజేషన్ మరియు బహుభాషా సంభాషణలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జియోహాట్‌స్టార్ అందరికీ చేరువయ్యే వేదికగా మారుతోంది. ఇది ప్రేక్షకులు తమకు నచ్చిన విధంగా వినోదాన్ని పొందేలా వారిని శక్తివంతం చేస్తుంది.



