బిజినెస్

దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్టును దక్కించుకున్న రామ్‌కీ ఇన్‌ఫ్రా

భాగ్యనగరానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రామ్కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక భారీ విజయాన్ని అందుకుంది.

హైదరాబాద్: భాగ్యనగరానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రామ్కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ లిమిటెడ్ (MITL)తో కలిసి దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా (DPIA) ఫేజ్-1 అభివృద్ధి కోసం కీలక ఒప్పందంపై సంతకం చేసింది. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (DMIC) కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం విలువ జీఎస్‌టీ ఇతర నిర్వహణ ఆదాయాలతో కలిపి సుమారు ₹1,401.84 కోట్లుగా ఉంది.

ప్రాజెక్టు గడువు నిర్వహణ బాధ్యతలు

  • ఈ ప్రాజెక్టును నిర్ణీత ప్రారంభ తేదీ నుండి 930 రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
  • నిర్మాణం పూర్తయిన తర్వాత, రామ్కీ సంస్థ నాలుగు సంవత్సరాల పాటు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) సేవలను అందిస్తుంది.
  • ఇరు పక్షాల అంగీకారంతో ఈ నిర్వహణ గడువును భవిష్యత్తులో పొడిగించుకునే వీలుంది.

అభివృద్ధి పనుల పరిధి
రాయగడ జిల్లాలోని ఈ పారిశ్రామిక ప్రాంతంలో పార్సెల్ ‘బి’ అభివృద్ధి బాధ్యతలను రామ్కీ చేపడుతుంది. డిజైన్, ఇంజనీరింగ్, నిర్మాణం టెస్టింగ్ వంటి అన్ని విభాగాలను ఈ సంస్థే పర్యవేక్షిస్తుంది. ఈ ప్యాకేజీలో భాగంగా కింది మౌలిక సదుపాయాలను నిర్మిస్తారు:

  • అంతర్గత రోడ్లు ఇతర కీలక కట్టడాల నిర్మాణం.
  • వర్షపు నీటి కాలవలు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు.
  • మురుగునీటి వ్యవస్థ రీసైకిల్ చేసిన నీటి పంపిణీ నెట్‌వర్క్ అభివృద్ధి.
  • విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు సమాచార సాంకేతిక (ICT) అవసరాల కోసం ప్రత్యేక యుటిలిటీ డక్టుల ఏర్పాటు.

సంస్థ ప్రతినిధుల స్పందన
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి రామ్కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీఈఓ సునీల్ నాయర్ మాట్లాడుతూ, పెద్ద తరహా పారిశ్రామిక కారిడార్లలో తమ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దిఘి ప్రాంతంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు మెరుగుపడి, వ్యాపార కార్యకలాపాలు ఎంతో సులభతరం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *