బిజినెస్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘చక్ర’ ఆవిష్కరణ: సన్‌రైజ్ రంగాలకు లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), దేశ ఆర్థిక పరివర్తనలో కీలకమైన సన్‌రైజ్ రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ‘చక్ర’ (CHAKRA) – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ముంబైలో ప్రారంభించింది.

హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), దేశ ఆర్థిక పరివర్తనలో కీలకమైన సన్‌రైజ్ రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ‘చక్ర’ (CHAKRA) – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ముంబైలో ప్రారంభించింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా, కొత్త తరం సాంకేతికత మరియు సుస్థిర అభివృద్ధి రంగాలకు బాధ్యతాయుతమైన ఫైనాన్సింగ్ అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశం.

కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు, ఎస్‌బీఐ చైర్మన్చ ల్లా శ్రీనివాసులు శెట్టి సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 2030 నాటికి ఈ సన్‌రైజ్ రంగాలు సుమారు రూ. 100 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా వేస్తున్నారు.

చక్ర ప్రధానంగా దృష్టి సారించే 8 రంగాలు:

  • పునరుత్పాదక ఇంధనం (Renewable Energy)

  • గ్రీన్ హైడ్రోజన్

  • ఎలక్ట్రిక్ మొబిలిటీ

  • సెమీకండక్టర్స్

  • అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ & బ్యాటరీ స్టోరేజ్

  • డీకార్బనైజేషన్

  • స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

  • డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్

ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ, వర్ధమాన రంగాలను అర్థం చేసుకోవడంలో, విశిష్టమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించడంలో ‘చక్ర’ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది కేవలం నిధుల పంపిణీకే పరిమితం కాకుండా, నాలెడ్జ్ షేరింగ్, ప్రాజెక్ట్ అప్రైజల్ మరియు పాలసీ సంప్రదింపులకు ఒక వేదికగా పనిచేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *