ఎంఎస్ ధోనీతో స్వరాజ్ ట్రాక్టర్స్ భాగస్వామ్యం పొడిగింపు..
మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ తమ బ్రాండ్ యొక్క ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీతో భాగస్వామ్యాన్ని రెన్యువల్ చేసుకున్నట్లు వెల్లడించింది

మొహాలీ: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్స్ తమ బ్రాండ్ యొక్క ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీతో భాగస్వామ్యాన్ని రెన్యువల్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఉమ్మడి విలువలపై నిర్మితమైన ఈ భాగస్వామ్యం స్వరాజ్ బ్రాండ్ పరిణామక్రమానికి కీలక మూలస్తంభంగా మారింది. ఈ భాగస్వామ్యానికి మరింత సహజత్వం మరియు విశ్వసనీయతను చేకూరుస్తూ, ధోనీ తన సొంత వ్యవసాయ పనుల కోసం స్వరాజ్ ట్రాక్టర్‌ని ఎంచుకున్నప్పటి నుండి ఈ అనుబంధం మొదలైంది.
ఈ భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుండి, కీలకమైన మార్కెట్లలో స్వరాజ్ బ్రాండ్ గుర్తింపును పెంపొందించడంలో మరియు కస్టమర్లలో నమ్మకాన్ని పెంపొందించడంలో ఎంఎస్ ధోనీ కీలక పాత్ర పోషించారు. ధోనీ యొక్క అసామాన్యమైన వ్యక్తిత్వం, అపారమైన విశ్వసనీయత మరియు నమ్మకమైన ఇమేజ్ అనేవి సరళమైన, శక్తివంతమైన మరియు విశ్వసనీయమైన స్వరాజ్ బ్రాండ్ విలువలకు సరిగ్గా సరిపోతాయి.
“విశ్వసనీయమైన, ప్రామాణికమైన, పనితీరుపై నిరంతరం ప్రధానంగా దృష్టి పెట్టే సుస్థిరమైన స్వరాజ్ బ్రాండ్ తత్వాన్ని ధోనీ ప్రతిబింబిస్తారు. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో బంధాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, మా బ్రాండ్ విలువలను చాటిచెప్పడానికి సహాయపడింది. భవిష్యత్తులో కూడా సుసంపన్న వారసత్వ విలువలకు కట్టుబడి ఉంటూ, సమకాలీన దృక్పథంతో స్వరాజ్ బ్రాండ్‌ను, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ధోనీ భాగస్వామ్యం కీలకంగా తోడ్పడగలదు” అని ఎంఅండ్ఎం లిమిటెడ్ స్వరాజ్ డివిజన్ సీఈవో గగన్‌జోత్ సింగ్ పేర్కొన్నారు.
ఈ విస్తరించిన భాగస్వామ్యంలో భాగంగా, వివిధ వేదికలవ్యాప్తంగా స్వరాజ్ చేపట్టబోయే భవిష్యత్తు ప్రచార కార్యక్రమాల్లో ధోనీ కనిపిస్తారు. ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న భారతీయ రైతుల అవసరాలకు తగ్గట్టుగా బ్రాండ్ తీసుకురాబోతున్న సరికొత్త ఉత్పత్తుల ప్రచారంలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు.
ఎంఎస్ ధోనీతో తమ భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా, స్వరాజ్ ట్రాక్టర్స్ కొత్తగా “భరోసా” పేరిట ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. బ్రాండ్ మరియు క్రికెటింగ్ దిగ్గజం ప్రతీకలుగా నిలిచే శక్తి, నమ్మకం మరియు విశ్వసనీయతను ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుంది. కొత్త క్యాంపెయిన్ లింకులు ఈ దిగువన ఇవ్వబడ్డాయి.



