బిజినెస్

Axis Finance: కలెక్షన్ కాల్స్ కోసం ఏఐ మానిటరింగ్‌ని ఆవిష్కరించిన యాక్సిస్ ఫైనాన్స్

హైదరాబాద్: భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) ఒకటైన యాక్సిస్ పైనాన్స్ లిమిటెడ్ (ఏఎఫ్ఎల్) వినియోగదారుల భద్రతను పరిరక్షిస్తూ, నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తూ, రీపేమెంట్ వ్యవహారాల్లో కమ్యూనికేషన్ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించేలా తమ కలెక్షన్ కాల్స్‌కి సంబంధించి పూర్తి స్థాయి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఆవిష్కరించింది.

సాధారణంగా రుణ జీవితకాలంలో కలెక్షన్ కాల్స్ అనేవి కీలకమైన కస్టమర్ టచ్‌పాయింట్‌గా ఉంటాయి. తాజా ఫ్రేమ్‌వర్క్ అమలుతో, బాధ్యతాయుతమైన కలెక్షన్ విధానాలు, అంతర్గత గవర్నెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా కలెక్షన్ కాల్స్ సముచితంగా, మర్యాదపూర్వకంగా ఉండేలా చూసేందుకు కలెక్షన్ కాల్స్ ఇకపై పర్యవేక్షించబడతాయి, విశ్లేషించబడతాయి. దీనితో ఈ ప్రక్రియ పరిమిత స్థాయిలో మాన్యువల్‌గా కాల్ శాంప్లింగ్ తీసుకోవడం నుంచి టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ వైపు పరివర్తన చెందినట్లవుతుంది. తద్వారా కస్టమర్లతో ఇంటరాక్షన్లను మరింత పటిష్టంగా పర్యవేక్షించేందుకు వీలవుతుంది.

ఏఐ ఆధారిత ఫ్రేమ్‌వర్క్ కావడం వల్ల కస్టమర్లతో సంభాషణల విషయంలో మరింత లోతైన విశ్లేషణలు లభిస్తాయి. తగిన విధంగా ఫాలో అప్ చర్యలు తీసుకునేందుకు టీమ్ సభ్యులకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ప్రమాణాలు, నిబంధనలు, వ్యవహారశైలి ఆధారంగా కస్టమర్లతో సముచితంగా సంభాషించేందుకు, కలెక్షన్స్ ప్రక్రియలో స్పష్టతను మెరుగుపర్చేందుకు ఇది సహాయపడుతుంది.

పరిమిత స్థాయిలో శాంప్లింగ్‌కి పరిమితం కాకుండా విస్తృత స్థాయిలో కాల్స్‌ని కవర్ చేయడం ద్వారా యాక్సిస్ ఫైనాన్స్, కస్టమర్లతో సంభాషణల విషయంలో జవాబుదారీతనాన్ని, పర్యవేక్షణను మరింత పటిష్టపర్చింది. గవర్నెన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసే విధంగా ఈ ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది. కలెక్షన్ ప్రక్రియవ్యాప్తంగా వినియోగదారుల భద్రతను పరిరక్షించడం, వసూళ్ల విధానాలు బాధ్యతాయుతంగా ఉండేలా చూడటానికి ప్రాధాన్యత ఇవ్వబడింది. నిర్దేశిత వ్యవహార శైలికి భిన్నంగా ఉన్న ప్రవర్తనలు గుర్తించబడి, నిర్దిష్ట రివ్యూ ప్రక్రియ ద్వారా పైస్థాయికి చేరవేయబడతాయి. అవసరమైన సందర్భాల్లో సత్వర, సముచిత దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు ఈ విధానం తోడ్పడుతుంది.

తరచుగా తలెత్తే కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు, రీపేమెంట్ చర్చల్లో ఎదురయ్యే సవాళ్లను తగ్గించేందుకు ఈ సంభాషణల పర్యవేక్షణ ద్వారా తెలిసే విషయాలు తోడ్పడతాయి. అలాగే కస్టమర్లకు విశ్వసనీయమైన అనుభూతిని అందించగలవు. కస్టమర్లతో ముఖాముఖిగా ఉండే లావాదేవీల్లో గవర్నెన్స్‌ను పటిష్టం చేసుకునేందుకు యాక్సిస్ ఫైనాన్స్ తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగా లైవ్, అత్యంత భారీ కలెక్షన్ల వ్యవస్థలో ఏఐ ఆధారిత మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ అమలు చేయబడుతోంది.

“బాధ్యతాయుతమైన, పారదర్శకమైన విధానాలతో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు మేము కట్టుబడి ఉన్నాం. మా ఏఐ ఆధారిత మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్ దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతి సంభాషణ సముచితంగా, స్పష్టంగా, గౌరవప్రదంగా నిర్వహించబడేలా చూసుకునేందుకు తోడ్పడుతుంది. మా ప్రక్రియలవ్యాప్తంగా గవర్నెన్స్‌ని పటిష్టం చేసుకోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. నిబంధనలకు అనుగుణంగా కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా కార్యకలాపాలను నిర్వహించడంపై మేము మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తుంది” అని యాక్సిస్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో సాయి గిరిధర్ తెలిపారు.

కస్టమర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ దన్నుతో నిర్దిష్ట ప్రక్రియలను సమర్ధవంతంగా నిర్వహించడంపై యాక్సిస్ ఫైనాన్స్‌కి గల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *