API Market: గణనీయమైన లాభాలతో Q3 FY26లో పటిష్టమైన పనితీరు కనపర్చిన వాన్‌బరీ లిమిటెడ్
గ్లోబల్ ఏపీఐ మార్కెట్‌లో, దేశీయంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ వాన్‌బరీ లిమిటెడ్ (Wanbury Ltd) 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి, తొమ్మిది నెలల వ్యవధికి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

API Market: గ్లోబల్ ఏపీఐ మార్కెట్‌లో, దేశీయంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ వాన్‌బరీ లిమిటెడ్ (Wanbury Ltd) 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి, తొమ్మిది నెలల వ్యవధికి తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి:
కార్యకలాపాల ఆదాయం రూ. 162.4 కోట్లుగా నమోదు. Q3 FY25లో ఇది రూ. 133.5 కోట్లు. వార్షిక ప్రాతిపదికన 21.7 శాతం వృద్ధి. ఏపీఐ వాల్యూమ్స్ పెరగడం, కీలకమైన తయారీ ప్లాంట్లలో సామర్థ్యాల వినియోగం మెరుగుపడటం, ఫార్ములేషన్స్ వ్యాపారంలో స్థిరమైన పనితీరు సాధించడం ఇందుకు దోహదపడ్డాయి.
త్రైమాసికంలో EBITDA (ఇతర ఆదాయం కూడా కలిపి) రూ. 26.9 కోట్లుగా నమోదైంది. Q3 FY25లో నమోదైన రూ. 14.8 కోట్లతో పోలిస్తే 81.7 శాతం పెరిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, మెరుగైన ప్రొక్యూర్‌మెంట్ వ్యూహాలు, అధిక స్థాయిలో ప్రోడక్టుల ఈల్డ్‌లు, సాల్వెంట్ రికవరీ సిస్టంలను మెరుగుపర్చుకోవడం ఇందుకు దోహదపడ్డాయి.
Q3 FY25లో నమోదైన 11.0%తో పోలిస్తే 16.5 శాతానికి మెరుగుపడ్డ EBITDA మార్జిన్
Q3 FY25లో లాభం (PAT) రూ. 1.2 కోట్లుగా ఉండగా, తాజా త్రైమాసికంలో 1,194.3 శాతం వృద్ధి చెంది రూ. 15.8 కోట్లకు చేరింది. నిర్వహణ పనితీరు, మార్జిన్ల వృద్ధి, వ్యయ నియంత్రణ చర్యలు మెరుగ్గా ఉండటం, ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం ఇందుకు కారణం.
PAT మార్జిన్ Q3 FY25లో 0.9 శాతంగా ఉండగా Q3 FY26లో 9.7 శాతానికి పెరిగింది.
2025 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధికి:
9M FY26 వ్యవధిలో కార్యకలాపాల నుంచి ఆదాయం రూ. 485.7 కోట్లకు చేరింది. 9M FY25లో నమోదైన రూ. 427.5 కోట్లతో పోలిస్తే వార్షికంగా 13.6 శాతం వృద్ధి చెందింది. ఏపీఐ విభాగంలో వాల్యూమ్స్ వృద్ధి చెందడం, ఫార్ములేషన్స్ విభాగం పనితీరు స్థిరంగా ఉండటం ఇందుక దోహదపడింది.
9M FY26లో EBITDA (ఇతర ఆదాయం కూడా కలిపి) రూ. 77.6 కోట్లుగా నమోదైంది. 9M FY25లో నమోదైన రూ. 48.3 కోట్లతో పోలిస్తే వార్షికంగా 60.6 శాతం పెరిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, ప్రోడక్ట్ మిక్స్ మెరుగ్గా ఉండటం, సామర్థ్యాల వినియోగం పెరగడం, వ్యయ నియంత్రణ చర్యలను కొనసాగించడంలాంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి.
9M FY25లో నమోదైన 11.3%తో పోలిస్తే 16.0 శాతానికి మెరుగుపడ్డ EBITDA మార్జిన్
9M FY25లో లాభం (PAT) రూ. 10.3 కోట్లుగా ఉండగా, తాజా 9M FY26లో 332.5 శాతం వృద్ధి చెంది రూ. 44.4 కోట్లకు చేరింది. నిర్వహణ పనితీరు, ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడటం, ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం ఇందుకు కారణం.
PAT మార్జిన్ 9M FY25లో 2.4 శాతంగా ఉండగా 9M FY26లో 9.1 శాతానికి పెరిగింది.
కంపెనీ పనితీరుపై వాన్‌బరీ లిమిటెడ్ డైరెక్టర్ Mr. మోహన్ రాయన (Mohan Rayana) ఇలా వివరించారు.
ఆదాయాల పటిష్ట వృద్ధి: ఏపీఐలో అత్యధిక వాల్యూమ్స్ ,ఫార్ములేషన్స్ సెగ్మెంట్లలో ఒక మోస్తరు వృద్ధి దన్నుతో వార్షిక ప్రాతిపదికన ఆదాయం Q3FY26లో 22 శాతం, 9MFY26లో 14 శాతం వృద్ధి చెందింది.
మెరుగుపడిన లాభదాయకత: EBITDA Q3FY26లో రూ. 26.9 కోట్లకు, 9MFY26లో రూ. 77.6 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన Q3లో 81.7 శాతం, 9MFY26లో 60.6 శాతం మెరుగుపడింది. అధిక మార్జిన్ ఉండే SKUల అమ్మకాలు పెరగడం, ప్రోడక్ట్ మిక్స్ బాగుండటంతో పాటు అధిక ఈల్డ్‌లతో ఉత్పాదకత పెరగడం, సాల్వెంట్ రికవరీ పెరగడం, ప్రొక్యూర్‌మెంట్ మెరుగుపడటంలాంటి అంశాల దన్నుతో మార్జిన్లు పెరగడం ఇందుకు దోహదపడింది.
PAT వృద్ధి: Q3FY25లో PAT రూ. 1.2 కోట్లుగా ఉండగా Q3FY26లో రూ. 15.8 కోట్లకు చేరింది. 9MFY25లో రూ. 10.3 కోట్లుగా ఉన్న PAT 9MFY26లో రూ. 44.4 కోట్లకు చేరింది. కార్యకలాపాలు పటిష్టంగా ఉండటం, ఫైనాన్స్ వ్యయాలు తగ్గడంతో లాభం గణనీయంగా వృద్ధి చెందింది.
API విభాగం ప్రత్యేకతలు: కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ: యూరోపియన్ కస్టమర్‌కి అధునాతన తణుకు ప్లాంటు నుంచి హై పొటెంట్ ఎనస్థటిక్ ఏపీఐ షిప్‌మెంట్, కమర్షియల్ ఇన్వాయిసింగ్ Q3FY26లో పూర్తయ్యింది. తదుపరి రాబోయే కొత్త ఉత్పత్తులు – యాంటీడయాబెటిక్, యాంటీగోఆగ్యులెంట్ (రక్తాన్ని పలుచన చేసే థిన్నర్), కాఫ్ సప్రెసంట్ (యాంటి టసివ్), యాంటీడిప్రెసంట్. రాబోయే రోజుల్లోనూ వాన్‌బరీ పటిష్ట వృద్ధి సాధించే స్థితిలో ఉంది.
ఫార్ములేషన్స్ పురోగతి: Q3, 9MFY26లో సానుకూల EBITDA; ఇటీవల ప్రవేశపెట్టిన న్యూట్రిషనల్ సప్లిమెంట్ C-Red, ఇతర ఉత్పత్తులతో మెరుగైన ఫలితాలు, కొత్త థెరప్యూటిక్ కేటగిరీల్లోకి ఆరోగ్యకరమైన విస్తరణ



