జాతీయంబిజినెస్

వాహనదారులకు బిగ్ అలర్ట్.. మొబైల్ నెంబర్ ఇప్పుడే అప్‌డేట్ చేయండి.. లేదంటే సేవలు ఆగిపోతాయి!

వాహన్, సారథి పోర్టల్‌లలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే OTP సేవలు నిలిచిపోతాయి. వాహన, లైసెన్స్ ఆన్‌లైన్ ప్రక్రియలు ఆగే ప్రమాదముందని కేంద్రం హెచ్చరించింది.

  • వాహన్, సారథి పోర్టల్‌లలో మొబైల్ నెంబర్ అప్‌డేట్ తప్పనిసరి
  • OTP సమస్యలతో వాహన సేవలు నిలిచే అవకాశం
  • కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన జారీ చేసింది. వాహన్, సారథి పోర్టల్‌లలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే ఆన్‌లైన్ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదురవుతాయని హెచ్చరించింది.

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రవాణా సేవలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌కు మారుతున్న నేపథ్యంలో, తాజా మొబైల్ నంబర్ ఉండటం అత్యంత కీలకమని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాహన రిజిస్ట్రేషన్, రిన్యూవల్, యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, పర్మిట్ సేవలు అన్నీ OTP ఆధారిత ధృవీకరణతోనే జరుగుతున్నాయని తెలిపింది.

అప్‌డేట్ చేయకపోతే సమస్యలే:

ఇప్పటికే చాలా మంది వాహనదారులు సంవత్సరాల క్రితం ఇచ్చిన పాత మొబైల్ నంబర్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఆ నంబర్లు ఇక యాక్టివ్‌లో లేకపోవడం వల్ల OTP రాక, సేవలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీని వల్ల లక్షలాది మంది పౌరులు అనవసరమైన సమస్యల్లో పడుతున్నారని కేంద్రం స్పష్టం చేసింది.

భద్రతకూ కీలకం:

మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం వల్ల వ్యక్తిగత లావాదేవీలు సులభంగా మారడమే కాకుండా, జాతీయ రవాణా డేటాబేస్ భద్రత కూడా మెరుగుపడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నకిలీ లావాదేవీలు, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఈ చర్య అవసరమని తెలిపింది.

మొబైల్ నంబర్ అప్‌డేట్ ఎలా చేయాలి?

వాహన్ పోర్టల్ ద్వారా:

  • vahan.parivahan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి
  • “Update Mobile Number” ఎంపికను ఎంచుకోండి
  • వాహన రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్ చివరి 5 అంకెలు నమోదు చేయండి
  • కొత్త మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTPతో ధృవీకరించండి
  • సబ్‌మిట్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోండి

సారథి పోర్టల్ ద్వారా (డ్రైవింగ్ లైసెన్స్):

  • sarathi.parivahan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  • మీ రాష్ట్రాన్ని ఎంపిక చేయండి
  • “Update Mobile Number” సేవను ఎంచుకోండి
  • లైసెన్స్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి
  • కొత్త మొబైల్ నంబర్ OTPతో వెరిఫై చేయండి

ఈ మొత్తం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. RTO కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే అప్‌డేట్ చేసుకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పుతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *