సిద్దిపేట జిల్లా కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో అయిదుగురు యువకులు గల్లంతు అయ్యారు. మరో ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు. ముషీరాబాద్ నుంచి సరదాగా గడిపేందుకు ఇక్కడికి వచ్చిన యువకులు ప్రమాదం బారిన పడ్డారు. గల్లంతు అయిన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. సెల్ఫీ తీసుకునేందుకు ఒకరి చేతి ఒకరు పట్టుకొని డ్యామ్ లో దిగినట్లు సమాచారం. వారు మునిగిపోవడానికి ముందు తీసుకున్న వీడియో ఇప్పుడు చాలా మంది షేర్ చేస్తున్నారు.
గల్లంతు అయిన వారి పేర్లు
1. ధనుష్ (20), 2. లోహిత్(17), 3. చీకట్ల ధనేశ్వర్(17), 4.సాహిల్(19) 5. జతిన్ (17)
బయటపడ్డ వారు
1కోమరి మృగంక్ (17), 2 ఎండీ ఇబ్రహీం(17)