75.8 శాతం మంది భారతీయులు యాక్టివ్ డైరీ వినియోగదారులు…
భారతదేశంలో పాలతో ఉన్న అనుబంధం కేవలం ఒక గ్లాసు పాలు తాగడానికే పరిమితం కాలేదు

- గృహ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్న మల్టీ ప్రొడక్ట్ మిల్క్ అండ్ డైరీ లైఫ్ స్టైల్
- గోద్రెజ్ జెర్సీ ఇండియా లాక్టోగ్రాఫ్ ఫలితాలు FY25-26
హైదరాబాద్: భారతదేశంలో పాలతో ఉన్న అనుబంధం కేవలం ఒక గ్లాసు పాలు తాగడానికే పరిమితం కాలేదు. మన అల్పాహారం, పండగ సమయంలో పంచుకునే మిఠాయిలు, రోజువారీ వంటలు మరియు ఇప్పుడు ప్రోటీన్ షేక్స్, స్మూతీలలో కూడా పాలు భాగమయ్యాయి. గోద్రెజ్ జెర్సీ విడుదల చేసిన లాక్టోగ్రాఫ్ నివేదిక ప్రకారం.. భారత దేశంలో 75.8 శాతం మంది ఇప్పుడు యాక్టివ్ డైరీ వినియోగదారులుగా ఉన్నారు. అంటే వీరు కేవలం పాలు మాత్రమే కాకుండా పెరుగు, పనీర్, నెయ్యి, వెన్న, లస్సీ, యోగర్ట్ మరియు చీజ్ వంటి రకరకాల పాల ఉత్పత్తులను క్రమం తప్పకుండా వాడుతున్నారు. పాలు కేవలం అప్పుడప్పుడు తీసుకునే అదనపు పానీయం మాత్రమే కాదు.. అన్ని ప్రాంతాలు మరియు అన్ని తరాల వారి భారతీయ ఆహార సంస్కృతిలో భాగమైపోయిన రోజువారీ బహుళ-ఉత్పత్తుల పోషకాహార వ్యవస్థగా డైరీ ఆవిర్భవించింది.
ఒక గ్లాసు పాలకు బదులుగా, భారతీయ గృహాలు ఈ నివేదిక పేర్కొన్న విధంగా ఒక “డైరీ బాస్కెట్”ను (పాల ఉత్పత్తుల సముదాయం) నిర్మించుకుంటున్నాయి. యాక్టివ్ డైరీ వినియోగదారులలో జాతీయ స్థాయిలో పెరుగు (80 శాతం), పనీర్ (76 శాతం), వెన్న (74 శాతం) మరియు నెయ్యి (71 శాతం) అత్యంత ఇష్టపడే ఉత్పత్తులుగా ఉన్నాయి. వీటి తర్వాత వరుసగా లస్సీ (63 శాతం), చీజ్ (58 శాతం), యోగర్ట్ (57 శాతం) మరియు సంప్రదాయ పాల మిఠాయిలు (55 శాతం) ఉన్నాయి. వంటల్లో, భోజన అనుబంధ పదార్థాలుగా, చిరుతిళ్లుగా మరియు వేడుకలలో డైరీ పోషిస్తున్న పాత్రను ఈ విస్తృత వినియోగం నొక్కి చెబుతోంది.
ఒక భారత్, అనేక డైరీ ప్లేట్లు..
భారతీయ గృహాలన్నింటిలో డైరీ అనేది ఒక ఉమ్మడి అంశంగా ఉన్నప్పటికీ, అది ప్లేట్‌పై కనిపించే విధానం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. డైరీ ఉత్పత్తులలో పెరుగు అత్యంత విస్తృతంగా కనిపిస్తుంది. దక్షిణాదిలో పెరుగన్నం, మజ్జిగ నుండి, ఉత్తరాదిన రైతా, దహీ వరకు దేశవ్యాప్తంగా రోజువారీ భోజనంలో విడదీయలేని భాగంగా కలిసిపోయింది. ఇది పెరుగును నిజమైన పాన్-ఇండియన్ ప్రధాన ఆహారంగా మార్చింది.
పనీర్ ఒకప్పుడు ఎక్కువగా ఉత్తర భారత వంటకాలకే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది. ప్రస్తుతం ఇది ప్రాంతీయ వంట పద్ధతుల్లోనూ మరియు వివిధ రకాల భోజనాల్లోనూ కనిపిస్తోంది. సంప్రదాయ మరియు ఆధునిక వంటకాలు రెండింటిలోనూ పనీర్ ఒక అంగీకరించిన శాఖాహార ప్రోటీన్గా ఎలా ఎదిగిందో ఇది ప్రతిబింబిస్తోంది.
అదే సమయంలో పాలతో చేసే రుచికరమైన పదార్థాలు తమ ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తున్నాయి. నెయ్యి, వెన్న, సంప్రదాయ పాల మిఠాయిలు గృహాల దైనందిన అలవాట్లలో, వేడుకలలో విడదీయలేని భాగంగా ఉన్నాయి. వినియోగదారులు ఆరోగ్యం మరియు సమతుల్యత పట్ల మరింత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ, డైరీ ఉత్పత్తులకు ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక ప్రాముఖ్యతను ఇది మరింత బలపరుస్తోంది.
ఆధునిక కాలంలో ప్రోటీన్ పట్ల అవగాహన పెరిగిన జీవనశైలికి, ముఖ్యంగా యువత, నగరాల్లో ఉండేవారికి అనుగుణంగా డైరీ తనను తాను మార్చుకుంది. సంప్రదాయ పద్ధతులే కాకుండా, ప్రస్తుతం స్మూతీలు, షేక్స్ మరియు కేఫ్ తరహా పానీయాలలో ఇది ప్రధానంగా కనిపిస్తోంది. శక్తి, ఫిట్నెస్ మరియు పోషణపై దృష్టి సారించే నేటి ఆధునిక దైనందిన అలవాట్లలో ఇది సులభంగా కలిసిపోయింది. పాలు మరియు డైరీ ఆధారిత పానీయాలు ఇప్పుడు కాఫీ, ప్రోటీన్ షేక్స్, స్మూతీల సరసన చేరుతున్నాయి. ఇవి కేవలం చిన్ననాటి అలవాటుగా మాత్రమే మిగిలిపోకుండా.. రోజువారీ శక్తి, అలసట నుండి కోలుకోవడం మరియు మెరుగైన పనితీరు కోసం ఉపయోగపడే బహుముఖ సాధనాలుగా అందరూ ఆదరిస్తున్నారు.
ఈ నివేదిక ఫలితాలపై గోద్రెజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శంతను రాజ్ మాట్లాడుతూ.. ‘భారతదేశం కేవలం ఒక గ్లాసు పాలు అనే ఆలోచనను దాటి నిర్ణయాత్మకంగా ముందుకు సాగింది. పాలు అనేవి ఒకే రకమైన ప్రధాన ఆహారంగా ఉండటం నుండి పనీర్, పాల ఆధారిత పానీయాలు మరియు అధిక ప్రొటీన్ కలిగిన ఉత్పత్తుల వరకు ఎలా పరిణామం చెందాయో మనం చూస్తున్నాం. ఇవి అద్భుతమైన రుచితో పాటు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. గోద్రెజ్ జెర్సీలో మా ప్రయాణం ఈ మార్పును ప్రతిబింబిస్తోంది. పాలపై ఉన్న నమ్మకాన్ని కొనసాగిస్తూనే, ఆధునిక వినియోగదారులకు మరింత పోషణ, సౌలభ్యం, అనేక ప్రయోజనాలను అందించేలా మేం విస్తరిస్తున్నాము. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా రుచి, ప్రొటీన్ మరియు రోజువారీ అవసరాలను కలగలిపి నేటి భారతదేశానికి తగ్గట్టుగా డైరీ రంగాన్ని కొత్తగా ఆవిష్కరించడమే మా లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.
భారతీయులు ఏం తింటున్నారు, ఎంత తరచుగా, ఏ రూపంలో తీసుకుంటున్నారు అనే అంశాలను విశ్లేషించడం ద్వారా మన దేశ ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక స్పష్టమైన అవగాహన కల్పిస్తోంది. రోజువారీ గృహ పోషణలో డైరీ ఒక ముఖ్యమైన పునాది అని ఇది ధృవీకరిస్తోంది. సంప్రదాయ భోజనపు థాలీ నుండి జిమ్ బాటిల్ వరకు, అలాగే ఇంటి వంటగది నుండి ఆధునిక కేఫ్ తరహా పానీయాల వరకు అన్నింటికీ సరిపోయేలా డైరీ ఉత్పత్తులు అన్నింటికీ సరిపోయేలా మారాయి.



