స్పెషల్ స్టోరీస్

Ilaiyaraaja: మార్చి 28న హైదరాబాద్‌లో ఇళయరాజా సంగీత జాతర.. గచ్చిబౌలిలో ఐదు దశాబ్దాల వేడుక

భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, మాస్ట్రో ఇళయరాజా స్వర ప్రస్థానానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా హైదరాబాద్ వేదికగా ఒక అద్భుతమైన వేడుకకు రంగం సిద్ధమైంది.

భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, మాస్ట్రో ఇళయరాజా స్వర ప్రస్థానానికి యాభై ఏళ్లు నిండిన సందర్భంగా హైదరాబాద్ వేదికగా ఒక అద్భుతమైన వేడుకకు రంగం సిద్ధమైంది. స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ తన అనుబంధ సంస్థ ‘రైట్‌ఫెస్ట్’ మరియు ‘XORA World’ ప్లాట్‌ఫాం ద్వారా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది 2026, మార్చి 28న గచ్చిబౌలి స్టేడియంలో ఈ భారీ సంగీత విభావరి జరగనుంది. ఏడు వేలకు పైగా గీతాలను ఆలపించి, వేల చిత్రాలకు ప్రాణం పోసిన ఇళయరాజా అరుదైన రికార్డును సెలబ్రేట్ చేసేందుకు ఈ వేదికను ఎంచుకున్నారు.

వివిధ విభాగాల్లోకి..
ఈ కార్యక్రమం ద్వారా స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ తన వ్యాపార పరిధిని కేవలం రెస్టారెంట్ సర్వీసులకే పరిమితం చేయకుండా, లైఫ్‌స్టయిల్, ఎంటర్టైన్‌మెంట్ విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది. వినియోగదారులకు సరికొత్త అనుభూతులను పంచడం ద్వారా బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.

నిర్వాహకుల స్పందన..

స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ చైర్మన్ మోహన్ బాబు కర్జేల మాట్లాడుతూ, ఇళయరాజా వంటి లెజెండ్ 50 ఏళ్ల వేడుకను నిర్వహించడం తమ సంస్థకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ఆహారం, సంస్కృతిని జోడిస్తూ ఒక బలమైన కమ్యూనిటీని నిర్మించాలనే తమ విజన్‌లో భాగంగానే ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *