Sangareddy: సంగారెడ్డి జిల్లాలో.. రెవెన్యూ అధికారులకు స్థాన చలనం!
సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

- డిప్యుటేషన్లపై కొత్త స్థానాల్లో పోస్టింగులు ఇస్తూ కలెక్టర్ పి.ప్రావీణ్య ఉత్తర్వులు
- పటాన్ చెరు తహసీల్దారుగా ఎన్. హరిబాబు
కందిలి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్ పి. ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. డిప్యుటేషన్లపై వారిని కొత్త స్థానాల్లో బాధ్యతలు ఇస్తూ వీటిని జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ఎన్. హరిబాబుకు సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా పోస్టింగ్ ఇచ్చారు. డిప్యుటేషన్ పై పటాన్ చెరు తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.
అందోలు– జోగిపేట ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న నాయబ్ తహసీల్దారు పి.శ్రీనివాస్ గౌడ్ ను కలెక్టరేట్లోని సూపరింటెండెంట్ – డి విభాగానికి పంపించారు.
సంగారెడ్డిలోని డీటీఎస్ఓ కార్యాలయంలో డీటీసీఎస్ గా పనిచేస్తున్న లింగ శేఖర్ ను పటాన్ చెరు నాయబ్ తహసీల్దారుగా డిప్యూటేషన్ పై పంపారు.
కలెక్టరు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న జి.సాయిలు పటాన్ చెరు గిర్దవారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.




