తెలంగాణ

Allen Hyderabad: జెఈఈ మెయిన్ ఫలితాల్లో అలెన్ హైదరాబాద్ జోరు..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన జెఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు.

JEE Main 2026 Results: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన జెఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. హైదరాబాద్‌కు చెందిన సామవేదం రఘు కపీష్ అక్షిత్ 99.9976982 పర్సెంటైల్‌తో సత్తా చాటగా, నియువ్ కొచెటా 99.9962271 పర్సెంటైల్‌తో అగ్రస్థానంలో నిలిచారని అలెన్ సౌత్ జోన్ హెడ్ మహేష్ యాదవ్ వెల్లడించారు. వీరితో పాటు హైదరాబాద్ సెంటర్ నుండి ఏడుగురు విద్యార్థులు 99.9 పర్సెంటైల్, మరో 51 మంది 99 పర్సెంటైల్ పైగా స్కోర్ సాధించి నగర కీర్తిని చాటారు.

జాతీయ స్థాయిలో ఆధిపత్యం:
ఈ ఏడాది జాతీయ స్థాయిలోనూ అలెన్ విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా మొత్తం 12 మంది 100 పర్సెంటైల్ సాధించగా, అందులో ఏడుగురు అలెన్ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థులే కావడం విశేషం. అలెన్ కోటా విద్యార్థి కబీర్ చిల్లార్ 300కి 300 మార్కులతో పర్ఫెక్ట్ స్కోరు సాధించి చరిత్ర సృష్టించాడు. అర్నవ్ గౌతమ్, శుభం కుమార్, భవేష్ పాత్ర, అనయ్ జైన్, నిమీ పురోహిత్, చిరంజీబ్ కర్ కూడా 100 పర్సెంటైల్ క్లబ్‌లో నిలిచారు.

విజయ రహస్యం, పారదర్శకత:
విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభతో పాటు అలెన్ అందించే నిర్మాణాత్మక శిక్షణ, నిరంతర విశ్లేషణే ఈ విజయానికి కారణమని సెంటర్ హెడ్ సౌరభ్ తివారీ తెలిపారు. తమ ఫలితాల విశ్వసనీయత కోసం ప్రముఖ ఆడిట్ సంస్థ ‘ఈవై ఇండియా’ (EY India) ద్వారా వీటిని ధృవీకరించినట్లు సీఈఓ నితిన్ కుక్రేజా పేర్కొన్నారు. అలెన్ అందించిన విద్యా వాతావరణం, అధ్యాపకుల నిరంతర సహకారం వల్లే ఈ ఘనత సాధించగలిగానని టాపర్ ఎస్ఆర్కే అక్షిత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *