Post Recruitment: సంగారెడ్డిలో పోస్టల్ ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఈ అవకాశం మీకోసమే
సంగారెడ్డి తపాలా విభాగం పరిధిలో స్పీడ్ పోస్ట్, పార్శిల్, అంతర్జాతీయ మెయిల్ సేవలను విస్తరించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సంగారెడ్డి: సంగారెడ్డి తపాలా విభాగం పరిధిలో స్పీడ్ పోస్ట్, పార్శిల్, అంతర్జాతీయ మెయిల్ సేవలను విస్తరించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్తగా పోస్టల్ ఫ్రాంచైజీ అవుట్‌లెట్ల ఏర్పాటు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీటీ 2.0 (APT 2.0) సాంకేతికత ద్వారా బుకింగ్, పికప్, డెలివరీ సేవలను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
అర్హతలు, ఇతర వివరాలు:
వయస్సు: దరఖాస్తుదారులు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్హత: కనీసం ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, కేవలం డెలివరీ సేవల కోసం పనిచేసే వారికి 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
ఇతర అవసరాలు: ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, అనుకూలమైన కార్యాలయ ప్రాంగణం కలిగి ఉండాలి. భారత దేశంలో నమోదైన సంస్థలు, కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆదాయం: ఈ పథకం ద్వారా బుకింగ్, డెలివరీలపై ఆకర్షణీయమైన కమిషన్ తో పాటు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇది యువతకు మంచి స్వయం ఉపాధి అవకాశం.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 15, 2026 లోపు https://app.indiapost.gov.in/customer-selfservice వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించాల్సిందిగా సంగారెడ్డి డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఒక ప్రకటనలో తెలిపారు.



