తెలంగాణసంగారెడ్డి

గుమ్మడిదలలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. 15 వార్డుల్లో భారీ విజయం – పటాన్‌చెరులో కారు జోరు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. గుమ్మడిదల మరియు ఇంద్రేశం మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది.

గుమ్మడిదల మున్సిపాలిటీ ఫలితాలు (మొత్తం 22 వార్డులు):
గుమ్మడిదలలో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 15 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 4, బీజేపీ 2, మరియు ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

వార్డుల వారీగా విజేతల జాబితా:

బీఆర్ఎస్ విజేతలు: సంధ్య గోవర్ధన్ రెడ్డి (1), పద్మ వెంకట్ రెడ్డి (2), అభిషేట్టి రాజశేఖర్ (3), మురళి (5), తుపాకుల రాజు (6), కిషన్ (7), సంజయ్ రెడ్డి (8), టి. శేఖర్ రెడ్డి (9), జి. హుస్సేన్ (10), కుమార్ గౌడ్ (11), ఎ. మాధవి సత్యనారాయణ (12), ప్రేమిలా సంజీవ రెడ్డి (15), ఎస్. కుమార్ గౌడ్ (17), చక్రపాణి (21), ఎస్. స్వప్న కుమార్ యాదవ్ (22).

కాంగ్రెస్ విజేతలు: గోకర నిర్మల (4), ఎం. నారాయణ రెడ్డి (13), సద్ది జైపాల్ రెడ్డి (16), వరలక్ష్మి (19).

బీజేపీ విజేతలు: రాజిరెడ్డి (18), జి. విజయ్ లక్ష్మి (20).

ఇండిపెండెంట్: కె. రమేష్ (14).

ఇస్నాపూర్ రిజల్ట్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మొత్తం వార్డులు 26

బీఆర్ఎస్ 11
కాంగ్రెస్ 9
స్వతంత్రం నలుగురు

ఇంకా 3 వార్డుల ఫలితాలు రావాల్సి ఉంది

ఇంద్రేశం మున్సిపాలిటీ ఫలితాలు:
ఇంద్రేశం మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. ఇక్కడ మొత్తం స్థానాల్లో బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 6 స్థానాలను సాధించింది. బీజేపీ 2 స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ వరుస విజయాలతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఇంద్రేశం మున్సిపాలిటీ 18 వార్డుల ఎన్నికల ఫలితాలు.

భారత రాష్ట్ర సమితి 9
కాంగ్రెస్ 6.
బిజెపి 2.
స్వతంత్ర 1.

వార్డుల వారిగా వివరాలు

1. మల్లేపల్లి శ్రీనివాస్ (కాంగ్రెస్)
2. సారా లావణ్య (స్వతంత్ర)
3. ప్రియాంక రెడ్డి (బీజేపీ)
4. మన్నె లక్ష్మి (కాంగ్రెస్)
5. పట్లోళ్ల లతారెడ్డి (బిఆర్ఎస్)
6. అంతిరెడ్డి (బిఆర్ఎస్)
7. రమేష్ (బిఆర్ఎస్)
8. ప్రమీల ( బిఆర్ఎస్)
9. రమేష్ (బిఆర్ఎస్)
10. శివకుమార్ గౌడ్ (కాంగ్రెస్)
11. అంబలి (బిఆర్ఎస్)
12. పట్లోళ్ల హరీష్ రెడ్డి (బిఆర్ఎస్)
13. పట్లోళ్ల అంజలి రెడ్డి (బిఆర్ఎస్)
14. రాచమల్ల శ్రీనివాస్ గౌడ్ (కాంగ్రెస్)
15. సరిత భుజంగరెడ్డి (కాంగ్రెస్)16. కిరీటాల లక్ష్మీ (బిజెపి)
17. పాశం ఊర్మిళ వెంకటరెడ్డి (బిఆర్ఎస్)
18. సద్గురు భూపాల్ గౌడ్ (కాంగ్రెస్)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *