ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు పిలుపు
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్, లక్డారం గ్రామాల్లో పార్టీ నాయకులు ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇంచార్జ్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరిగింది. నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రతి వార్డులో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, పారదర్శక పాలన కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్, సోమిరెడ్డి, రాములు గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, దేవేందర్ యాదవ్, మేరాజ్ ఖాన్ మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



