BRS: మున్సిపల్ ఎన్నికలకు.. బీఆర్ఎస్ సమన్వయకర్తలు వీరే!
మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక పీఠాలను కైవసం చేసుకునేందుకు వీలుగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు.
* ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా నేతలకు బాధ్యతలు అప్పగించిన హరీశ్ రావు
కందిలి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధిక పీఠాలను కైవసం చేసుకునేందుకు వీలుగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను నియమించారు. జనవరి 12 నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చర్చించి, ముందుకు సాగాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం ఈ వివరాలను సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వెల్లడించారు.
మున్సిపాలిటీల వారీగా.. సమన్వయకర్తలు వీరే!
సంగారెడ్డి జిల్లా
1. జహీరాబాద్ – దేవి ప్రసాద్, మాజీ చైర్మన్, బెవరేజెస్ కార్పొరేషన్
2. కోహీర్ – ఎంఏ హకీమ్, న్యాయవాది, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
3. సదాశివపేట– సపాన్ దేవ్, మాజీ కార్పొరేటర్
4. సంగారెడ్డి – రాజనర్సు, మున్సిపల్ ఛైర్ పర్సన్, సిద్దిపేట
5. అందోలు–జోగిపేట – పట్లోళ్ల నరహరి రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
6. నారాయణఖేడ్ – జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
7. జిన్నారం– పాల సాయిరాం, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్
8. గుమ్మడిదల – పట్నం మాణిక్యం, డీసీసీబీ ఉపాధ్యక్షుడు
9. గడ్డపోతారం – సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్
10. ఇస్నాపూర్ – ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్
11. ఇంద్రేశం – రంగినేని అభిలాష్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
మెదక్ జిల్లా
1. మెదక్ – ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
2. రామాయంపేట – రవీందర్ రెడ్డి, సుడా మాజీ ఛైర్మన్
3. తూప్రాన్ – సంపత్ రెడ్డి, సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ ప్రెసిడెంట్
4. నర్సాపూర్ – వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ
సిద్దిపేట జిల్లా
1. దుబ్బాక – భూపేష్ , న్యాయవాది, రాష్ట్ర నాయకుడు
2. గజ్వేల్– రాధాకృష్ణ శర్మ, జడ్పీ మాజీ ఛైర్మన్



