తెలంగాణ

Siddipet: ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), సంక్షేమ హాస్టళ్లలో భద్రతను పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.

  • విద్యార్థులకు వైద్య పరీక్షలు..
  • స్కూల్ సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు

సిద్దిపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), సంక్షేమ హాస్టళ్లలో భద్రతను పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

భద్రతపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసే స్థితిలో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు సీసీ కెమెరాలు లేని విద్యాసంస్థల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలి.

మరమ్మతులు..

ఇప్పటికే ఉండి, పనిచేయని స్థితిలో ఉన్న కెమెరాలకు వెంటనే రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ అధికారులు, గురుకుల కోఆర్డినేటర్లను ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్యం, రవాణా సౌకర్యాలు

సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో జిల్లాలోని విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేలా విద్యా, ఆరోగ్య శాఖలు ఉమ్మడి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం స్కూళ్లు, కాలేజీల సమయాలకు అనుగుణంగా బస్సులు నడపాలని సిద్దిపేట డిపో మేనేజర్ ను ఆదేశించారు. అలాగే కలెక్టరేట్ (IDOC) వద్ద ఉద్యోగుల కోసం బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏవో, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *