తెలంగాణమెదక్

చైనా మాంజా తగిలి మహిళకు తీవ్ర గాయాలు

 ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను వినియోగించడంతో చేగుంట మండల కేంద్రంలో ఓ మహిళ కుడి కాలుకి తీవ్ర గాయాలు అయిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

చేగుంట: ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను వినియోగించడంతో చేగుంట మండల కేంద్రంలో ఓ మహిళ కుడి కాలుకి తీవ్ర గాయాలు అయిన ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. పంతంగి ఎగురవేసిన సమయంలో చైనా మాంజా తగలడంతో చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన చేరి మన్నెమ్మ కుడి కాలికి లోతైన గాయాలు ఏర్పడి అధిక రక్తస్రావం జరిగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ చైనా మాంజా పట్టణ కేంద్రం వాడకం కొనసాగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి సంఘటనానికి చేరుకొని పట్టణంలో అమ్ముతున్న  దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *