Andole – Jogipet: 24 నెలలు రూ.250 కోట్లు.. అభివృద్ధికి కేరాఫ్ అందోల్ – జోగిపేట
ఇన్వెస్టర్లకు ప్రస్తుతం అందోల్ -జోగిపేట నయా కేరాఫ్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన అనధి కాలంలోనే ఏకంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు.

- పురపాలక ఎన్నికల వేళ 20 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థుల ఉమ్మడి వినతి
అందోల్: స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 80 ఏళ్లు కావొస్తున్న అందోల్, జోగిపేట మున్సిపాలిటీ మాత్రం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. ఉపాధి లేక వలస వెళ్లే వారి కుటుంబాలు కోకొల్లలు. ప్రస్తుతం ఈ పరిస్థితులు మారుతున్నాయి. ఇన్వెస్టర్లకు ప్రస్తుతం అందోల్ -జోగిపేట నయా కేరాఫ్‌గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన అనధి కాలంలోనే ఏకంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పరుగులు పెడుతోంది.
అందోల్ జోగిపేట మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల అధికారిక జాబితాను పార్టీ ప్రకటించింది. సుమారు 16,550 మంది ఓటర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో రిజర్వేషన్లకు అనుగుణంగా, ప్రజలకు అందుబాటులో ఉండే సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ తెలిపింది.
పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఉపాధి కల్పనే లక్ష్యం
ముఖ్యంగా ఈ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి లభించాలనే ఉద్దేశంతో కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో క్లీన్ ఇండస్ట్రీస్ ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసి, స్థానిక నిరుద్యోగులకు పెద్దపీట వేస్తామని గతంలోనే మంత్రి స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రాంతానికి వలసలు పెరిగి.. ఇక్కడున్న వారి వలసలు తగ్గుముఖం పడతాయి. అదే సమయంలో స్థానిక వ్యాపారాలకు ఊతం లభిస్తుంది. అనధి కాలంలోనే ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గడిచిన 25 నెలల్లో…
గడిచిన రెండు సంవత్సరాల కాలంలోనే మంత్రి కృషితో మున్సిపాలిటీకి రూ. 250 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దీనికి అదనంగా మరో రూ. 320 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, వీటికి త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రానుందని సమాచారం.
మంజూరైనవివే.. కొనసాగుతున్నవివే..
రోడ్లు, ఇతరాలు..
- జోగిపేట్ నుండి అజ్జమర్రి వరకు రహదారి అభివృద్ధి: రూ. 80 కోట్లు.
- సంగుపేట – అన్నసాగర్ మధ్య డివైడర్ లైట్లతో 4 లేన్ రోడ్డు: రూ. 20 కోట్లు.
- కొత్త మున్సిపల్ కార్యాలయం: రూ. 6 కోట్లు.
- RDO కార్యాలయం, నివాస సముదాయం: రూ. 5.75 కోట్లు.
- ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్: రూ. 20 కోట్లు.
- సంగుపేట అండర్‌పాస్ వద్ద వెల్‌కమ్ ఆర్చ్: రూ. 2 కోట్లు.
విద్య, వైద్యం:
- 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి (50 పడకల మాతా శిశు సంరక్షణ విభాగంతో కలిపి): రూ. 60 కోట్లు.
- నర్సింగ్ కళాశాల స్థాపన: రూ. 43 కోట్లు.
- రూ. 6 కోట్లతో పాలిటెక్నిక్, కేజీబీవీ, గురుకుల పాఠశాలల ఆధునీకరణ (వంటశాలలు, డార్మెటరీలు, వాష్ రూముల పునరుద్ధరణ).
పర్యాటకం, సుందరీకరణ:
- అందోల్ చెరువు కట్ట సుందరీకరణ: రూ. 2 కోట్లు.
- చెరువు ఒడ్డున కల్చరల్ భవనం: రూ. 5 కోట్లు.
- వివేకానంద పార్క్ అభివృద్ధి: రూ. 2 కోట్లు.
రాబోయే సంక్షేమ పథకాలు:
ఇందిరమ్మ ఇళ్లు: సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి నిధులు, స్థలం లేని వారి కోసం 161 జాతీయ రహదారి పక్కన 15 ఎకరాల్లో ఇందిరమ్మ ప్లాట్ల లేఅవుట్ అభివృద్ధి.
పింఛన్లు: అర్హులైన వృద్ధులకు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేలా పారదర్శకమైన పింఛన్ల పంపిణీ.
డ్రైనేజీ వ్యవస్థ: పట్టణంలోని అన్ని వార్డులకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ.
అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక ప్రగతే అజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్తోంది. ఈ భారీ అభివృద్ధి పనుల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని మంత్రి దామోదర రాజనరసింహా ధీమా వ్యక్తం చేశారు.



