తెలంగాణసంగారెడ్డి

Sangareddy Municipality:సంగారెడ్డిలో ‘హస్తం’ జోరు.. పోస్టల్ బ్యాలెట్లలో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి.

Sangareddy Municipality: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో తొలి ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 38 వార్డులున్న సంగారెడ్డి మున్సిపాలిటీలో ప్రస్తుత సమాచారం ప్రకారం..

కాంగ్రెస్ దూకుడు:
సుమారు 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ముఖ్యంగా 3, 4, 6, 7, 23, 26, 35, 36, 37, 38 వార్డుల్లో కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చాటుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో సాగిన ప్రచారం పార్టీకి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.

BRS, MIM పరిస్థితి:
ప్రతిపక్ష బిఆర్ఎస్ (BRS) ప్రస్తుతం 1, 25 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎంఐఎం (MIM) పార్టీ 24వ వార్డులో తన పట్టును నిలుపుకుంది.

ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయి ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *