తెలంగాణసంగారెడ్డి

Jinnaram: కాంగ్రెస్ టికెట్ల వివాదం.. నేతలు డబ్బులకు అమ్ముకున్నారని మహిళా కార్యకర్త ధర్నా

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి.

జిన్నారం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. నాలుగవ వార్డు కౌన్సిలర్ టికెట్ ఆశించిన ఒక మహిళా నాయకురాలు, తనకు బి-ఫాం ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కలిసి టికెట్లను అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారిని విస్మరించి, అధిష్టానం అనుమతి లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పార్టీ నాయకత్వం తనను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, సదరు నాయకుల తీరును నిరసిస్తూ ఆమె బహిరంగంగా ధర్నా చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *