తెలంగాణసంగారెడ్డి

Congress: మున్సిపల్ అభ్యర్థులకు బి-ఫారాల పంపిణీ చేసిన నిర్మలా జగ్గారెడ్డి

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో లైన్ క్లియర్ చేసింది.

సంగారెడ్డి: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో లైన్ క్లియర్ చేసింది. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మంగళవారం నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, అభ్యర్థులకు రెండు రోజుల ముందే బి-ఫారాలను అందజేసి ఎన్నికల బరిలోకి దింపారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ
సంగారెడ్డి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు నిర్మలా జగ్గారెడ్డి స్వయంగా బి-ఫారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘు గౌడ్, పట్టణ అధ్యక్షుడు జార్జ్ తో పాటు సీనియర్ నాయకులు బొంగుల రవి, సంతోష్, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు. అభ్యర్థులంతా ఐకమత్యంతో పనిచేసి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.

సదాశివపేట మున్సిపాలిటీ
సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన బి-ఫారాలను కూడా నిర్మలా జగ్గారెడ్డి సిద్ధం చేశారు. వీటిని సీడీసీ ప్రెసిడెంట్, సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డికి అందజేశారు. పార్టీ ఆదేశాల మేరకు వార్డుల్లో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేశామని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

అందోల్ – జోగిపేట మున్సిపాలిటీ
మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు అందోల్ – జోగిపేట పురపాలక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగింది. ఈ మున్సిపాలిటీ అభ్యర్థులకు సంబంధించిన బి-ఫారాలను మంత్రి వ్యక్తిగత సహాయకుడు (PA) హన్మండ్లుకు డీసీసీ అధ్యక్షురాలు అందజేశారు. జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. నామినేషన్ల సమర్పణకు మంగళవారమే చివరి రోజు కావడంతో, అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *