తెలంగాణసంగారెడ్డి
హలో జగ్గా జీ….. హౌ ఆర్ యు.. జగ్గారెడ్డిని ఆత్మీయంగా పలకరించిన రాహుల్ గాంధీ
తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏఐసిసి అధినాయకుడు రాహుల్ గాంధీ హాజరైన విషయం తెలిసిందే

- వికారాబాద్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ పిఏసి సమావేశం అనంతరం జరిగిన సన్నివేశం
సంగారెడ్డి: తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏఐసిసి అధినాయకుడు రాహుల్ గాంధీ హాజరైన విషయం తెలిసిందే. డీసీసీ అధ్యక్షుల సమావేశానికి ముందు కాంగ్రెస్ పీఏసీ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. సమావేశం ముగించుకుని రాహుల్ గాంధీ వెళ్తున్న సందర్భం లో ఆయన కారు వద్దకు చేరుకోగానే ఏపిసిసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అక్కడే ఉన్న జగ్గారెడ్డి ని చూసి రాహుల్ జీ …. జగ్గన్న ఈజ్ హియర్.. అంటూ రాహుల్ గాంధీ కి చెప్పారు. వెంటనే రాహుల్ గాంధీ జగ్గారెడ్డి వైపు చూసి చేతిని గట్టిగా పట్టుకుని హాయ్ జగ్గ జీ.. హౌ ఆర్ యు అంటూ ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కార్ లో ఎక్కి వెళ్లిపోయారు.



