తెలంగాణసంగారెడ్డి

Hetero: హెటెరో డ్రగ్స్ యూనిట్-1ను తక్షణమే మూసివేయాలి: టీపీజే ఏసీ డిమాండ్

దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువును విషపూరితం చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న హెటెరో డ్రగ్స్ (యూనిట్-1) పరిశ్రమను తక్షణమే మూసివేయాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • దోమడుగు మహిళల ఉద్యమ స్ఫూర్తి అభినందనీయం
  • కాలుష్య కారక పరిశ్రమపై పీసీబీ మొక్కుబడి ఆదేశాల పట్ల అభ్యంతరం

సంగారెడ్డి: దోమడుగు గ్రామంలోని నల్లకుంట చెరువును విషపూరితం చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న హెటెరో డ్రగ్స్ (యూనిట్-1) పరిశ్రమను తక్షణమే మూసివేయాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పండుగ పూట కూడా తమ ఉనికి కోసం, కాలుష్య రహిత భవిష్యత్తు కోసం దోమడుగు గ్రామ మహిళలు చేపట్టిన పోరాటం అత్యంత చైతన్యవంతమైనదని, వారి ఉద్యమ స్ఫూర్తికి అభినందనలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.

నల్లకుంట చెరువు గులాబీ రంగులోకి మారడానికి హెటెరో పరిశ్రమ నుండి విడుదలైన రసాయనాలే కారణమని ఐఐటీ హైదరాబాద్, పీసీబీ ల్యాబ్ నివేదికలు శాస్త్రీయంగా ధృవీకరించినట్లు అశోక్ కుమార్ గుర్తు చేశారు. ఇంతటి తీవ్రమైన పర్యావరణ విధ్వంసం జరిగినా, కాలుష్య నియంత్రణ మండలి (PCB) కేవలం చిన్నపాటి మరమ్మతులకు పరిమితమైన ఆదేశాలు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గత 12 ఏళ్లుగా ఇక్కడ కాలుష్యం వల్ల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెటెరో యూనిట్-1ను శాశ్వతంగా మూసివేసి, కంపెనీ ఖర్చుతోనే చెరువును శుద్ధి చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని టీపీజే ఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కమిటీ నాయకులు హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *