తెలంగాణసంగారెడ్డి
చైనా మాంజా కాటేయకుండా.. రక్షణ కవచం!
పోలీసులు ఎంతలా ప్రచారం చేస్తున్నా, నిషేధిత మాంజా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టూవీలర్ మీద వెళ్లే వారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి.

పోలీసులు ఎంతలా ప్రచారం చేస్తున్నా, నిషేధిత మాంజా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. టూవీలర్ మీద వెళ్లే వారికి ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటి నుంచి తనను తాను కాపాడుకునేందుకు నాథూరాం దీక్షరి ఇలా బైక్ ముందుభాగంలో ప్రత్యేక ఏర్పాటు చేయించారు. స్థానికంగా హార్డ్ వేర్ దుకాణం నడిపే ఆయన తానే సొంతంగా దీనిని తయారు చేసుకున్నారు. ఏటా ఈ సంక్రాంతి పండగ సమయంలో బైక్ కు ఈ రక్షణ కవచాన్ని బిగిస్తానని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగాక బాధపడేకంటే, మనల్ని మనం రక్షించుకోవడం కూడా ముఖ్యమేనని ఆయన వివరించారు.
కందిలి, సంగారెడ్డి



