తెలంగాణసంగారెడ్డి

Jaggareddy: జీవితంలో ఇకపై సంగారెడ్డి నుంచి పోటీ చేయను!

సంగారెడ్డిలో నేను ఓడిపోవడం రాహుల్ గాంధీని అవమానించినట్లైంది. అందుకే నేను జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాని జగ్గారెడ్డి అన్నారు.

  • రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచార సభ కోసం సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశామోనని ఫీల్ అయ్యాను
  • నేను ఓడిపోవడం, ఆయనను అవమానపరిచినట్లయింది
  • నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు ఇక్కడి మేధావులు, పెద్దలది
  • సంగారెడ్డిలో నా భార్య నిర్మల పోటీ చేసినా నేను ప్రచారానికి రాను
  • సంగారెడ్డిలో నిర్వహించిన సభలో స్పష్టం చేసిన జగ్గారెడ్డి

కందిలి, సంగారెడ్డి
‘‘సంగారెడ్డిలో నేను ఓడిపోవడం రాహుల్ గాంధీని అవమానించినట్లైంది. అందుకే నేను జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాను.- రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచార సభ కోసం సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశామోనని ఫీల్ అయ్యాను. నా ఓటమికి కారణం పేద ప్రజలు కాదు. ఇక్కడి మేధావులు, పెద్దలదే అందుకు కారణం. భవిష్యత్తులో సంగారెడ్డిలో నా భార్య నిర్మల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా నేను ప్రచారానికి రాను” అంటూ సంగారెడ్డిలో నిర్వహించిన సభలో జగ్గారెడ్డి స్పష్టత ఇచ్చారు.

నాకోసం ప్రత్యేకంగా.. రాహుల్​ గాంధీ ఇక్కడికి వచ్చారు!
‘‘నాకోసం రాహుల్ గాంధీ సంగారెడ్డికి ప్రత్యేకంగా వచ్చారు. నన్ను గెలిపించాలని ప్రచారం చేశారు. అయినా నన్ను ఇక్కడి ప్రజలు ఓడించారు. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయను. రాహుల్​ గాంధీ నా భుజంపై చేయి వేసి జగ్గారెడ్డిని గెలిపించాలని అడిగితే నన్ను ఇక్కడి వారు ఓడించారు. నా జీవితంలో ఇది మరిచిపోలేనిది. నేను చాలా ఫీల్​ అయ్యాను. రాష్ట్రంలో నేను ఎక్కడికైన వెళ్లయినా కాంగ్రెస్​ పార్టీకి ఓటేయని ప్రచారం చేస్తాను. కానీ సంగారెడ్డిలో ప్రచారం చేయను. కాంగ్రెస్​ పార్టీకి ఓటేయమని అడగను”అంటూ జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఈ గంజ్​ మైదానానికి.. ఇందిరా గాంధీ వచ్చారు!
‘‘ఇదే గంజ్ మైదాన్లో రాహుల్ గాంధీ నా పక్కన నిలబడి ప్రచారం చేసినా మీరు నన్ను ఓడగొట్టారు.
ఇదే గంజ్ మైదానానికి ఇందిరా గాంధీ వచ్చారు. ఇందిరా గాంధీ మనవడు నాకోసం సంగారెడ్డి వచ్చి నా పక్కన నిబడినా నన్ను ఓడగొట్టారు. ఆ విషయంలో చాలా ఫీల్ అయిన. సంగారెడ్డికి అనవసరంగా రాహుల్ గాంధీని తీసుకొచ్చి అవమాన పర్చిన అని అనుకున్నాను. అందుకే జీవితంలో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయొద్దనే నిర్ణయం తీసుకున్నా’’నని జగ్గారెడ్డి వివరించారు.

వాళ్లు కూడా డబ్బులు తీసుకొని.. ఓట్లేస్తే ఎలా?
‘‘పేదవాడు వెయ్యి రూపాయలు తీసుని ఓటు వేస్తే నేను పట్టించుకోను. కానీ చదువుకునోళ్లు , మేధావులు పైసలు తీసుకుని ఓట్లు వేస్తే ఎలా? దిల్లీలో ఆరునెలల క్రితం కొంతమంది దిల్లీ వాళ్లు మాట్లాడుకున్నారట. సీఎం రేవంత్ రెడ్డి గెలిచిండు, కోమటిరెడ్డి గెలిచిండు, కానీ రాహుల్ గాంధీ మనిషి జగ్గారెడ్డి ఎట్లా ఓడిపోయాడు అని అనుకున్నారంట. నాకు చాలా అవమానం అనిపించింది. రాహుల్ గాంధీ ని అనవసరంగా సంగారెడ్డికి పిలిపించాను కదా అని బాధ పడ్డాను ”అంటూ జగ్గారెడ్డి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల జాగాలు.. అందరికీ ఇస్తానంటూ!
ఎన్నికలతో సంబంధం లేదని, సంగారెడ్డి పట్టణంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తానని ఈ సందర్భంగా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఓటేసినా, వేయకున్నా ప్రతి ఒక్క పేదకూ న్యాయం జరిగేలా చూస్తానన్నారు. తాను మాట ఇస్తే, నూరుశాతం నెరవేర్చుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ వేదిక సాక్షిగా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు. తాను మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో దానిని నెరవేర్చే వరకు విశ్రమించే పరిస్థితి ఉండదన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *