Muncipal Results: సంగారెడ్డి, సదాశివపేటల్లో ఎగిరిన జగ్గారెడ్డి జెండా.. చైర్మన్ పీఠం కాంగ్రెస్‌దే!
సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు.

సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) తన పట్టును మరోసారి నిరూపించుకున్నారు. నేడు విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ
సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది.
పార్టీల వారీగా ఫలితాలు:
- కాంగ్రెస్: 22
- బీఆర్ఎస్: 10
- బీజేపీ: 02
- ఎంఐఎం: 01
- స్వతంత్రులు: 03
ముఖ్య విజేతలు:
23వ వార్డు నుంచి గెలుపొందిన కూన వనిత సంతోష్ కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా నిలిచారు. కుమ్మరి కృష్ణ (1), శోభరాణి (4), వంశీ యాదవ్ (7), శ్రీలత శ్రీశైలం యాదవ్ (9), శైలేష్ రెడ్డి (10) వంటి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
సదాశివపేట మున్సిపాలిటీ
సదాశివపేటలో కూడా జగ్గారెడ్డి మార్క్ స్పష్టంగా కనిపించింది. ఇక్కడ మొత్తం 26 వార్డులకు గాను కాంగ్రెస్ (INC) 17 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది.
విజేతల జాబితా (సదాశివపేట):
కాంగ్రెస్ (17 స్థానాలు): ఎరుక నర్సింలు (వార్డు 2), హెచ్. రేణుక (3), ఖుతేజా ఫాతిమా (5), పాతదొడ్డి అనిత (7), బేగరి అరుణ్ కుమార్ (9), గోపి ప్రియాంక (11), పులిమామిడి మమత (12), గౌసియా బేగం (15), కొత్తగొల్ల లావణ్య (16), ఎండి షాజీ (17), ఆకుల నిఖిత (18), రోజా పాట్లూరి (19), మునిపల్లి అంజమ్మ (20), ఎండి వాజిద్ (21), వి. లక్ష్మి ప్రియ (23), కోవూరి శంకర్ గౌడ్ (25).
బీఆర్ఎస్ (7 స్థానాలు): నీలం అర్జున్ ఫణి కృష్ణ (1), ఎండి నసీరుద్దీన్ (4), నాగుల మాణెమ్మ (6), కొత్తగొల్ల సోమశేఖర్ (8), సతాని శ్రీశైలం (10), ఎర్ర విశాలి (13), షబ్నం (24), పాటిల్ అపర్ణ (26).
బీజేపీ: వుల్లిగడ్డల ఉమా రాణి (14).
స్వతంత్ర: గరేల గౌరీదేవి (22).
సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు ప్రధాన మున్సిపాలిటీలను గెలుచుకోవడంతో జగ్గారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు జిల్లావ్యాప్తంగా విజయోత్సవాల్లో మునిగిపోయాయి.



