తెలంగాణసంగారెడ్డి
సంగారెడ్డిలో హోలీ వేడుకలు.. డప్పు కొట్టి స్టెప్పులేసిన జగ్గారెడ్డి

సంగారెడ్డి పట్టణంలో హోలీ సంబరాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పండుగ పూట తన స్నేహితులతో కలిసి రంగులు పూసుకున్న ఆయన, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించారు.
కేవలం సరదాగా గడపడమే కాకుండా, అక్కడి కళాకారులతో మమేకమై స్వయంగా డప్పు కొట్టి వారితో కలిసి ఆడిపాడారు. అనంతరం స్థానిక రామ మందిరం వద్ద నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో కూడా జగ్గారెడ్డి పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాకతో హోలీ సంబరాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, స్థానిక ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.



