తెలంగాణసంగారెడ్డి

Jaggareddy: తండ్రి చూపిన అభిమానం గుర్తు చేసుకొని… కొడుకుకు టికెట్ ఇచ్చిన జగ్గారెడ్డి!

మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా ఆదివారం జగ్గారెడ్డి సమక్షంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తాను నమ్మిన, తనను నమ్మినవారి విషయంలో జగ్గారెడ్డి ఎంతటి ప్రేమను చూపుతారనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది

* కౌన్సిలర్​ టికెట్​ ఇవ్వాలని అడ్డూ అనే యువకుడిని తీసుకొని గల్లీ ప్రజలతో కలిసి జగ్గారెడ్డి వద్దకు వచ్చిన క్రిష్ణ
* అడ్డూ తండ్రి ఫోటో అందరికీ చూపిస్తూ 2003లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి
* డ్రైవరుగా పనిచేస్తున్న హషం అలీ రోడ్డు పక్కన నిల్చున్న తనను చూసి తాను నడుపుతున్న కారు ఆపి తన దగ్గరకు వచ్చాడని గుర్తు చేసుకున్న జగ్గారెడ్డి
* మీరు ఏ పార్టీ నుంచైనా నిలబడండి.. మేమంతా కలిసి గెలిపిస్తామని అడ్డూ తండ్రి హషం అలీ చెప్పారని అందరికీ వివరించిన జగ్గారెడ్డి
* తప్పకుండా మీరు ఎమ్మెల్యే అవుతారని విశ్వాసం ప్రకటించిన అడ్డూ తండ్రి హషం అలీ
* ఈ విషయాలన్నీ వివరించి అప్పటికప్పుడే గల్లీ ప్రజల సమక్షంలో అడ్డూకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించిన జగ్గారెడ్డి

కందిలి, సంగారెడ్డి
మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా ఆదివారం జగ్గారెడ్డి సమక్షంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తాను నమ్మిన, తనను నమ్మినవారి విషయంలో జగ్గారెడ్డి ఎంతటి ప్రేమను చూపుతారనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. తన మనసులో ముద్రించుకుపోయిన అపురూపమైన జ్ఞాపకాలు, ఆయన నిర్ణయాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పే సన్నివేశమిది. ఆ కథేంటో మీరూ చదవండి.

కౌన్సిలరు టికెట్​ ఇవ్వాలంటూ… క్రిష్ణతో కలిసి వచ్చి అడ్డూ!
మున్సిపల్​ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఆశావహులంతా టికెట్ల కోసం ఆయా పార్టీల ముఖ్య నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే 34వ వార్డు నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్న ఎండీ అమీద్​ అలియాస్​ అడ్డూ తమ గల్లీకి చెందిన పెద్దమనిషి క్రిష్ణతో పాటు స్థానికులను తీసుకొని సంగారెడ్డిలోని ఐబీలో ఉన్న జగ్గారెడ్డికి వద్దకు వచ్చారు. అడ్డూ చాలా కాలంగా పార్టీకి సేవలందిస్తున్నారని, ఆయనకు టికెట్​ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా క్రిష్ణ వివరించారు. ఆ మాటలను విన్న జగ్గారెడ్డి వెంటనే ఒకసారి మీ నాన్న ఫొటో చూయించు అంటూ అడ్డూను అడిగారు.

ఫొటో చూసి.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని!
అడ్డూ ఫొటో చూయించగానే జగ్గారెడ్డి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘అడ్డూ తండ్రి హషం అలీ డీసీసీబీ బ్యాంకు మేనేజరు వద్ద డ్రైవరుగా పనిచేసేవారు. ఒక రోజు నుంచి హైదరాబాద్​ లో రోడ్డు మీద నిల్చునున్నాను. ఆసమయంలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను. బ్యాంకు మేనేజరు కారులో ఉండగానే… హషం అలీ ఆ కారును రోడ్డు పక్కన ఆపారు. నా వద్దకు పరుగెత్తూ వచ్చారు. అన్నా.. మిమ్ముల్ని ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అలా నాతో చాలా సమయం మాట్లాడుతూనే ఉన్నారం”టూ ఆనాటి ఘటనను అందరికీ గుర్తు చేశారు.

మీరు పోటీ చేయండి.. కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం!
‘‘అలా చాలా సమయం నాతో హషం అలీ మాట్లాడారు. అన్నా.. మీరు ఏ పార్టీ నుంచైనా సరే ఎమ్మెల్యే టికెట్​ తెచ్చుకోండి. మేమంతా మీకు మద్దతుగా ప్రచారం చేస్తాం. కచ్చితంగా మిమ్ముల్ని గెలిపించుకుంటాం. 2004 ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అయి తీరుతార’’ని తన పట్ల ఎంతో విశ్వాసం ఉంచి హషం అలీ చెప్పారని జగ్గారెడ్డి వివరించారు. ఈ విషయాలన్ని చెప్పిన వెంటనే అడ్డూను 34వ వార్డు నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున కౌన్సిలర్​ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అడ్డూ తరఫున వచ్చిన పెద్దమనిషి క్రిష్ణతో పాటు గల్లీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆనాటి ఘటనను ఇంకా యాది పెట్టుకుంటారని సంతోషించారు. ఇలా జగ్గారెడ్డిపై అభిమానం కురిపించిన హషం అలీ కుమారుడికి ఈసారి ఎన్నికల్లో కౌన్సిలరుగా పోటీ చేసే అవకాశం దక్కింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *