తెలంగాణసంగారెడ్డి

Hyderabad: మరెల్లి దత్తుకు ‘ప్రైడ్ ఆఫ్ భారత రత్న’ అవార్డు ప్రదానం

సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) మరెల్లి దత్తుకు అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్: సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న సంగారెడ్డి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ) మరెల్లి దత్తుకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ప్రైడ్ ఆఫ్ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు.

వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సమాజానికి దత్తు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్, దైవజ్ఞ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని దత్తుకు అవార్డును అందజేసి అభినందించారు.

ఈ కార్యక్రమంలో వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సామాజిక సేవలో తనవంతు కృషి చేస్తున్న మరెల్లి దత్తుకు ఈ అవార్డు రావడం పట్ల పలువురు విద్యావేత్తలు, మిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *