Mind Space: విజయవంతంగా మైండ్‌స్పేస్ ఎకో రన్ 2.0… పాల్గొన్న 4,200 మంది ఔత్సాహికులు
భాగ్యనగరంలోని మాదాపూర్ వీధులు ఆదివారం ఉదయం ఉత్సాహంతో నిండిపోయింది. మైండ్‌స్పేస్ మాదాపూర్‌లో నిర్వహించిన మైండ్‌స్పేస్ ఎకో రన్ 2.0లో 4,200 మందికి పైగా రన్నర్లు పాల్గొని ఈ ఈవెంట్‌ను ఘనంగా విజయవంతం చేశారు

హైదరాబాద్: భాగ్యనగరంలోని మాదాపూర్ వీధులు ఆదివారం ఉదయం ఉత్సాహంతో నిండిపోయింది. మైండ్‌స్పేస్ మాదాపూర్‌లో నిర్వహించిన మైండ్‌స్పేస్ ఎకో రన్ 2.0లో 4,200 మందికి పైగా రన్నర్లు పాల్గొని ఈ ఈవెంట్‌ను ఘనంగా విజయవంతం చేశారు. వరుసగా రెండో ఏడాది మైండ్‌స్పేస్ REIT, మిర్చి సహకారంతో నిర్వహించిన ఈ రన్, నగర స్థాయి రన్నింగ్ అనుభవాన్ని పర్యావరణ బాధ్యతతో మేళవిస్తూ హైదరాబాద్ వాసులను ఒక్కటిగా కలిపింది.
అనుభవజ్ఞులైన రన్నర్లు, తొలిసారి పరిగెత్తినవారు, కుటుంబాలు, కార్పొరేట్ టీమ్స్ పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఈ ఈవెంట్ నిజమైన కమ్యూనిటీ సెలబ్రేషన్‌గా మారింది. మిర్చి ఆర్జేలు తమ ఎనర్జీతో వాతావరణాన్ని మరింత హుషారుగా మార్చగా, సెలబ్రిటీలు దివి వాధ్య, హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పళ్ల హాజరై రన్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
ఈ రన్‌లో 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల విభాగాలు నిర్వహించారు. 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ మరియు 10 కిలోమీటర్ల కేటగిరీల్లో 18 సంవత్సరాలు పైబడినవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. 8 సంవత్సరాలు పైబడినవారికి ఓపెన్‌గా ఉన్న 5 కిలోమీటర్ల రన్ – ఈ కార్యక్రమాన్ని అన్ని వయసుల వారికి అనువైన ఫిట్‌నెస్ వేదికగా నిలిపింది. హైదరాబాద్‌లోని కార్యాలయాలు, నివాస ప్రాంతాల నుంచి వచ్చి, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్‌కు బలమైన కమ్యూనిటీ స్పిరిట్‌ను తీసుకొచ్చారు.

వాటి వినియోగాన్ని తగ్గించేందుకు..
పర్యావరణహిత అనుభవమే కేంద్రంగా రూపొందించిన మైండ్‌స్పేస్ ఈకోరన్ 2.0లో ప్లాంట్ చేయగలిగే బిబ్స్, ఆర్గానిక్ జెర్సీలు, రీఫిల్లబుల్ వాటర్ స్టేషన్లు, బ్రేక్‌ఫాస్ట్‌కు బయోడిగ్రేడబుల్ కట్లరీ వంటి ఈకో ఫ్రెండ్లీ రేస్ కిట్స్ ఉపయోగించారు. సింగిల్ యూజ్ వినియోగాన్ని తగ్గించడం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ ఈ ఈవెంట్‌లో ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి.
రేస్ డేకు ముందు, ఫిబ్రవరి 20, 21 తేదీల్లో నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకోరన్ ఎక్స్‌పోలో, సస్టైనబిలిటీ ఫ్లీ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణహిత ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, ఎన్జీఓ భాగస్వామి నిర్మాణ్ సహకారంతో ప్రత్యేక ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.
ఇదే మా ఆశయం..
ఈ రెండో ఎడిషన్‌పై కే రహేజా కార్ప్ (ఏపీ & తెలంగాణ) సీఓఓ శ్రావణ్ కుమార్ గోనే మాట్లాడుతూ, మైండ్‌స్పేస్ ఈకోరన్ 2.0 మా అభివృద్ధి కార్యక్రమాల్లో సస్టైనబిలిటీని అంతర్భాగంగా మార్చాలన్న మా నిబద్ధతకు ప్రతిబింబం. ఇది కేవలం ఒక మారథాన్ కాదు. పెద్ద స్థాయిలో కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా పర్యావరణం, సమాజంపై స్పష్టమైన సానుకూల ప్రభావం ఎలా సాధ్యమవుతుందో ఈ ఈవెంట్ చూపిస్తోంది. ఈ వేదికను ప్రతి ఏడాది మరింత విస్తరించి, దీని ప్రభావాన్ని ఇంకా పెంచాలని మేము ఆశిస్తున్నాం… అని అన్నారు.
రెండో ఏడాదితో మైండ్‌స్పేస్ ఈకోరన్, హైదరాబాద్‌లో మైండ్‌ఫుల్ లివింగ్, కమ్యూనిటీ వెల్‌నెస్, సస్టైనబిలిటీ ఆధారిత జీవనశైలి వైపు పెరుగుతున్న ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా, ఈ ఈవెంట్‌లో సేకరించిన వ్యర్థాలను అప్‌సైకిల్ చేసి కుర్చీలుగా తయారు చేసి, ఎన్జీఓ భాగస్వామి నిర్మాణ్ కు చెందిన పాఠశాల పిల్లలకు అందించనున్నారు.



