తెలంగాణసంగారెడ్డి

గడ్డపోతారంలో బీఆర్ఎస్ ప్రభంజనం: 14 వార్డుల్లో ఘనవిజయం – ఇంద్రేశంలో కాంగ్రెస్ బోణి

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ తన జోరును ప్రదర్శించింది.

సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ తన జోరును ప్రదర్శించింది. ముఖ్యంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో గడ్డపోతారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లి ఘనవిజయం సాధించింది. ఇక్కడ మొత్తం 18 వార్డులకు గాను బిఆర్ఎస్ ఏకంగా 14 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

గడ్డపోతారం మున్సిపాలిటీ వార్డుల వారీగా విజేతలు:
1వ వార్డులో బాలు గారి మాధవి శ్రీనివాస్ (కాంగ్రెస్), 2వ వార్డులో భాగ్యలక్ష్మి కొండకళ్ళ (బిఆర్ఎస్), 3వ వార్డులో మద్దూరి పెంటేష్ (బిఆర్ఎస్), 4వ వార్డులో మద్దూరి కార్తీక్ (బిఆర్ఎస్), 5వ వార్డులో గద్దె సుష్మ గణేష్ (బిఆర్ఎస్), 6వ వార్డులో స్వప్న కుమార్ యాదవ్ (బిఆర్ఎస్), 7వ వార్డులో వాహబ్ కాజిపల్లి (కాంగ్రెస్), 8వ వార్డులో అరికెల సంధ్య సురేష్ (బిఆర్ఎస్), 9వ వార్డులో ఆకుల మమత నవీన్ (బిఆర్ఎస్), 10వ వార్డులో లక్ష్మణ గౌని మహేందర్ గౌడ్ (బిఆర్ఎస్), 11వ వార్డులో జలగారి మల్లేశం (బిఆర్ఎస్), 12వ వార్డులో ఠాకూర్ స్వాతి గణేష్ సింగ్ (బిఆర్ఎస్), 13వ వార్డులో కూతడి నవీన్ (బిఆర్ఎస్), 14వ వార్డులో నిరుడి శ్రీనివాస్ (బిఆర్ఎస్), 15వ వార్డులో ఇంద్రసేన (కాంగ్రెస్), 16వ వార్డులో ఎర్రోళ్ల అశోక్ (బిఆర్ఎస్), 17వ వార్డులో కుమ్మరి కృష్ణ (బిఆర్ఎస్) విజయం సాధించగా, 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పోతారం సతీష్ గెలుపొందారు.

ఇక ఇంద్రేశం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి లక్డారం సరిత భుజంగ రెడ్డి 158 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. సరితకు 439 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి బిఆర్ఎస్ అభ్యర్థి ఒగ్గు సుమతికి 281 ఓట్లు లభించాయి. ఇస్నాపూర్ మున్సిపాలిటీ 12వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మచ్చా కిషోర్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం శ్రీశైలంపై విజయం సాధించి బిఆర్ఎస్ ఖాతాలో మరో సీటు వేశారు. నియోజకవర్గంలో బిఆర్ఎస్ సాధించిన ఈ విజయాల పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *