తెలంగాణసంగారెడ్డి

రూ. 4 కోట్ల తో సంగారెడ్డి పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణం

సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో నూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు కానున్నాయి.

  • 3.80 కోట్లతో సదాశివపేట పట్టణం లోనూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణం
  • ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి ప్రతిపాదనలు అందించిన జగ్గారెడ్డి

సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో నూతన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు కానున్నాయి. సదాశివపేట పట్టణం లో ఆర్ అండ్ బి గెస్ట్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. ఆ బిల్డింగ్ స్థానం లో రూ. 3.80 కోట్లతో నాలుగు సూట్ రూం లతో కూడిన నూతన గెస్ట్ హౌస్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. సంగారెడ్డి పట్టణం జిల్లా కేంద్రం కావడం తో వివిఐపి, విఐపి ల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడున్న గెస్ట్ హౌజ్ సరిపోవడం లేదు. దీనికి అదనంగా అదే ప్రాంగణం లో నాలుగు సూట్ రూం లతో కూడిన మరో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. జగ్గారెడ్డి స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి ప్రతిపాదనలు అందించారు. జగ్గారెడ్డి ప్రతిపాదనలు ఆమోదించి వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బి ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *