తెలంగాణసంగారెడ్డి

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రచారం

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం చిట్కుల్ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తలారి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కాలనీ వాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.

బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..

చిట్కుల్ గ్రామంలోని అన్ని కాలనీల్లో జరిగిన అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, గతంలో తామే రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు కంటికి కనిపించే అభివృద్ధి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కాలనీల సమగ్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గూడెం మధుసూధన్ రెడ్డి, సతీమణి యాదమ్మ, కుమారుడు విక్రమ్ రెడ్డిలతో పాటు పటాన్‌చెరు మండల ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్లు సోమిరెడ్డి, తుమ్మల పాండు రంగారెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ ప్రచారంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *