Sangareddy: ఎన్నికల బందోబస్తుపై డీజీపీ సమీక్ష.. అక్రమ మద్యం, అరాచక శక్తులపై కఠిన చర్యలకు ఆదేశం
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు.

సంగారెడ్డి: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో దృశ్య సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, రౌడీషీటర్లపై ముందస్తు నిఘా ఉంచి వారిని బైండోవర్ చేయాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బలగాలను మోహరించాలని తెలిపారు. అక్రమ మద్యం నిల్వలు, రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఎక్సైజ్, ఎన్నికల చట్టాలపై నిపుణులు ప్రత్యేక అవగాహన కల్పించారు.



