తెలంగాణసంగారెడ్డి

Sangareddy: గంజి మైదాన్‌లో 17న జగ్గారెడ్డి భారీ బహిరంగ సభ.. ఇళ్లు లేని పేదల కోసం కీలక సమావేశం

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదాన్‌లో భారీ బహిరంగ సమావేశం జరగనుంది.

  • 2012-13లో పట్టాలు పొందిన వారు, ఇళ్ల స్థలాలు లేని వారు పెద్ద సంఖ్యలో హాజరు కావాలి: టీమ్ జగ్గారెడ్డి పిలుపు

సంగారెడ్డి: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదాన్‌లో భారీ బహిరంగ సమావేశం జరగనుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ (TGIIC) చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ముఖ్యంగా 2012-2013 సంవత్సరాల కాలంలో ఇళ్ల పట్టాలు పొంది, ఇప్పటివరకు గృహ నిర్మాణం పూర్తికాని వారు, అసలు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. లబ్ధిదారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా ఈ భేటీని నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పట్టాలు పొందిన వారు, ఇళ్లు లేని పేద ప్రజలు అందరూ ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని టీమ్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *