తెలంగాణసంగారెడ్డి

Sangareddy: రామ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిపై జగ్గారెడ్డి, నిర్మల క్లారిటీ.. ఆయనే నా ఛాయిస్.. కానీ పెద్దల నిర్ణయమే ఫైనల్!

సంగారెడ్డిలోని రామ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తమ అభిప్రాయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు.

సంగారెడ్డిలోని రామ్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తమ అభిప్రాయాన్ని మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..

“నా వ్యక్తిగత అభిప్రాయం రామ్ నగర్ కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఎక్స్ కౌన్సిలర్ శివుడే

తర్వాత శివుడు , గల్లీ పెద్దల నిర్ణయమే ఫైనల్

రామ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడటానికి పోటీ పడుతున్నారు. అందులో ఒకరు శివుడు సీనియర్ నాయకుడు. రెండవ వ్యక్తి బెస్త అంజన్న కొడుకు సిద్దు. మూడవ వ్యక్తి చెన్నమ్మ సత్తన్న కొడుకు ఎన్ఎస్ యుఐ నాయకుడు శ్రీకాంత్.

రామ్ నగర్ గల్లి పెద్ద మనుషులు మిఠాయి నారాయణ సార్, సత్తయ్య సార్, బస్వేశ్వర సార్, అశోక్ రెడ్డి, కల్పనక్క, యాదక్క, భజన మండలి నాయకులు నర్సింగ్ రావ్, ఉదయ్, శ్రీనివాస్ రాజు, సంగమేశ్వర్, చారి, రామ్ నగర్ భజన మండలి లో బస్తోల్లు మిఠాయి ప్రసాద్, రామ్ మందిర్ దత్తు, శ్రీను, శోభక్క, దిడ్డి గౌని మధు, కుమార్, సూరి మీ అందరికీ మీడియా ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నా…

… నేను మొదటి నుంచి సీనియర్ నాయకుడు ఎక్స్ కౌన్సిలర్ శివుడి ని రామ్ నగర్ నుంచి అభ్యర్థి గా అనుకుంటున్నాను. కానీ అక్కడ చెన్నమ్మ సత్తమ్మ కొడుకు శ్రీకాంత్, అంజన్న కొడుకు సిద్దు టికెట్ ఆశిస్తున్నారు. నా వరకు శివుడే కౌన్సిలర్ అభ్యర్థి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే కానీ ఫైనల్ నిర్ణయం కాదు. అభ్యర్థి విషయం లో శివుడి తో పాటు రామ్ నగర్ గల్లీ పెద్దలందరూ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. పోటీ లో ఉన్న శివుడు, శ్రీకాంత్, సిద్దు లతో పాటు రామ్ నగర్ గల్లి పెద్దలు, భజన మండలి సభ్యులు అందరూ కలిసి అభ్యర్థి విషయం లో ఏకాభిప్రాయానికి రావాలని కోరుతున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *