Sadashivapet: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.

సదాశివపేట: సదాశివపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె వార్డుల వారీగా అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి, అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రత్యర్థుల మైండ్ గేమ్‌లను తిప్పికొట్టి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మొత్తం 26 వార్డులకు గాను, పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సదాశివ పేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, సీడీసీ ఛైర్మన్ రాంరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్డుల వారీగా అభ్యర్థులు (వార్డు 1 నుండి 13 వరకు):
వార్డు 1 పిల్లోడి విశ్వనాథం
వార్డు 2 ఎరుకల నర్సింలు
వార్డు 3 రేణుక చిరంజీవి
వార్డు 4 మొయిజ్
వార్డు 5 ఉత్తేజ ఫాతిమా
వార్డు 7 అనిత విష్ణువర్ధన్ రెడ్డి
వార్డు 8 రేణుక శ్రీనివాస్ గౌడ్
వార్డు 9 అరుణ్ కుమార్
వార్డు 10 కంది నర్సింలు
వార్డు 11 గోపి ప్రియాంక
వార్డు 12 పులిమామిడి మమత రాజు
వార్డు 13 భవానీ విశ్వనాథం
వార్డు 14 స్వరూప రమేష్
వార్డు 15 గోసియ బేగం
వార్డు 16 కొత్తగొల్ల చంద్రశేఖర్
వార్డు 17 షాజీ
వార్డు 18 నికిత ప్రేమ కుమార్
వార్డు 19 రోజా నాగరాజు
వార్డు 20 అంజమ్మ సత్యనారాయణ
వార్డు 21 వాజిద్
వార్డు 22 పట్నం విజయలక్ష్మీ సుభాష్
వార్డు 23 లక్ష్మీ ప్రియ భరత్
వార్డు 24 కాలిం
వార్డు 25 శంకర్ గౌడ్
వార్డు 26 హారిక విజయ్
6వ వార్డు అభ్యర్థి ఎవరనేది పెండింగ్‌లో ఉంది. అభ్యర్థులందరూ తమ తమ వార్డులలో ప్రచారాన్ని వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. స్థానిక సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిని ప్రధాన అజెండాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలోకి దిగుతోంది.



