తెలంగాణసంగారెడ్డి

Sangareddy: సంగారెడ్డిలో ‘బైపాస్’ విస్తరణ షురూ.. జగ్గారెడ్డి దంపతుల హెచ్చరికతో కదిలిన యంత్రాంగం.. ఐబీ గోడ కూల్చివేత!

సంగారెడ్డి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులు గురువారం నాడు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి

సంగారెడ్డి పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బైపాస్ రోడ్డు విస్తరణ పనులు గురువారం నాడు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి. ఈ పనుల నిర్వహణలో హెచ్ఎండీఏ (HMDA) అధికారులు ప్రదర్శిస్తున్న అలసత్వంపై టీపీసీసీ కీలక నేత జగ్గారెడ్డి, సంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అధికారులను నిలదీశారు. పనులు వెంటనే ప్రారంభించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించడంతో యంత్రాంగం ఆగమేఘాల మీద కదిలింది.

ఐబీ కాంపౌండ్ వాల్ కూల్చివేత
గురువారం ఉదయం నుండే భారీ జేసీబీలతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డు విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఐబి (IB) గెస్ట్ హౌస్ ప్రహారీ గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే రోడ్డు వెడల్పు పనుల కోసం అడ్డుగా ఉన్న చెట్లను నరికివేసి మార్గాన్ని క్లియర్ చేశారు. పనుల వేగంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రాఫిక్ నియంత్రణ, పర్యవేక్షణ
పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఐబీ గెస్ట్ హౌస్ నుండి సంగారెడ్డి మండల పరిషత్ కార్యాలయం వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ పనులు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జ్, నాయకులు షఫీ, హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు క్షేత్రస్థాయిలో ఉండి పనులను పర్యవేక్షించారు.

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఐబీ గెస్ట్ హౌస్ నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఉన్న మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డు ఇరుగ్గా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విస్తరణ పనులు ప్రారంభం కావడంతో, పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. పట్టణ అభివృద్ధిపై జగ్గారెడ్డి దంపతులు చూపిస్తున్న చొరవను పలువురు అభినందిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *